Andhra Pradesh: వసతి గృహంలో పరిస్థితులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మధ్య హోంమంత్రి అనిత పర్యటనలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మరో హాస్టల్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఇక్కడ పరిస్థితులు మెరుగు పరిచేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బాలికల బీసీ హాస్టల్‌లో టిఫిన్‌గా ఉప్మా తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాళ్లు టిఫన్ తింటున్న టైంలోనే అందులో జెర్రి ఉన్నట్టు విద్యార్థులు గుర్తించారు. దీంతో మిగతా విద్యార్థులు అప్రమత్తమై ఆ ఫుడ్ తినకుండా వదిలేశారు. అప్పటికే తిన్న విద్యార్థులు ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు.
చెర్రి పడిన ఉప్మా తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించారు. పరిస్థితి మెరుగుపడిన తర్వాత హాస్టల్‌కు తరలించారు.
ఈ మధ్య శ్రీకాళహస్తిలోని బీసీ బాలుర హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఉదయం టిఫిన్ తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒకరిద్దరు కాదు ఏకంగా 16 మందికి ఫుడ్ పాయిజన్ అయ్యారు. వారందర్నీ స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు.
ఈ రెండు ఘటనలతోపాటు ఈ మధ్య హోంమంత్రి అనిత పాయకరావుపేట బీసీ బాలికల హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులు గమనించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అయితే ఆ టైంలో తన భోజనంలో బొద్దింక వచ్చినట్టు సోషల్ మీడియో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆమె కూడా హాస్టల్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. వార్డెన్ అందుబాటులో లేకపోవడం, భోజనం మెనూ సరిగా అమలు జరగకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేసి రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించాను.
ఈ రెండు ప్రాంతాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా హాస్టల్స్‌లో పరిస్థితి దారుణంగా ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇరుకు గదుల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని హాస్టల్స్ అద్దె భవనాల్లో రన్ అవుతున్నాయి. దీని వల్ల ప్రభుత్వానికి కూడా భారంగా మారుతోంది. స్థలాలు కేటాయించినప్పటికీ ఇంకా భవనాల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. గతంలో కోర్టులు కూడా ఈ విషయంలో తప్పు పట్టాయి. సరైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశాయి.