Andhra Pradesh Ration Card: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్. తప్పులను సరి చేసుకునేందుకు గడువు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో కొన్ని చోట్ల తప్పులు దొర్లాయి. పేర్లు, ఇంటి పేర్లు, ఇంటి నెంబర్లు కుటుంబ సభ్యల రిలేషన్ ఇలా చాలా తప్పులు కనిపించాయి. వాటిని సరి చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తోంది. 

Continues below advertisement

గత నెలలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన స్మార్ట్‌ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. దాదాపు 80శాతానికిపైగా ప్రక్రియ పూర్తి చేశారు. ఇలా జారీ చేసిన కార్డుల్లో తప్పులు ఉన్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో వాటిని సరి చేసేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. దీనిపై ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 31లోపు వివరాలను సరి చేసుకోవాలని సూచించారు. 

ఇప్పటికే జారీ అయిన స్మార్ట్ కార్డుల్లో తప్పులు దొర్లి ఉంటే గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి సరి చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆధార్ కార్డు, ఈ-కేవైసీ ఆధారంగా జారీ చేసిన కార్డుల్లో తప్పులు దొర్లాయని అందుకే కరెక్షన్‌కు అవకాశం ఇస్తున్నామని అన్నారు. అక్టోబర్ 31 నాటికి వాటిని సరి చేసుకోవాలని సూచించారు. వాటిని సరి చేసి నామినల్‌ ఫీజు 35 రూపాయలతో కార్డులు జారీ చేస్తామని చెప్పారు. వచ్చే వారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 

కంటిన్యూగా మూడు నెలలుగా రేషన్ తీసుకోని వాళ్ల కార్డులను డీయాక్టివేట్ చేశారు. దీని కారణంగా రాష్ట్రంలో చాలా మంది కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి. వీటిని యాక్టివ్ చేసుకోవడానికి సచివాలయాలకు వెళ్లి యాక్టివ్ చేసుకోవాలని సూచించారు.