AP Cabinet: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు గీత దాటి వ్యవహరిస్తున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ఇది మరింతగా బహిర్గతమైంది. చాలా మంది సభ్యులు మంత్రులను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కామెంట్స్‌తో ఇరుకున పెట్టారు. ఇది మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా దృష్టి పెట్టారు. ఇలాంటివి భవిష్యత్‌లో జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే మంత్రులను వార్న్ చేశారు. జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు చొరవ తీసుకొని కఠినంగా ఉండాలని క్లాస్ తీసుకున్నారు.         

Continues below advertisement

శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో కీలకమైన విషయాలు చర్చించిన తర్వాత మంత్రులతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఉందని దీన్ని చెడగొట్టేందుకు వివిధ శక్తులు పని చేస్తున్నాయని ఈ టైంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. మాట్లాడే ప్రతి మాట ఆచితూచి ఉండాలని చెప్పారు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేాల్లో కొందరు సభ్యులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడారని గుర్తు చేశారు. పార్టీ గీత దాటుతున్న ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత పూర్తిగా జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. కొందు తెలిస తెలియకో పరిధులు దాటి మాట్లాడారని, ఇకపై ఇలాంటిది జరగకూడని హెచ్చరించారు. దీనికి మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు.   

జిల్లా ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న మంత్రులకు చాలా బృహత్తర బాధ్యత ఉందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. రొటీన్ పనుల బాధ్యతలు జిల్లా యంత్రాంగం చూసుకుంటుందని, కీలకమైన విషయాలపై దృష్టి పెట్టాలన్నారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం చేసుకోవాలని, అసెంబ్లీ సమావేశాల్లో ఫ్లోర్ మేనేజ్మెంట్‌ చాలా ముఖ్యమని అన్నారు. ఒక్కో మంత్రికి ఏడుగురు ఎమ్మెల్యేల బాధ్యత అప్పగిస్తే వారు ఏం చేస్తున్నారో తెలుసుకోలేరా అని కాస్త సీరియస్‌గా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. జిల్లా బాధ్యతలతోపాటు శాఖాపరంగా వచ్చే విమర్శలను కూడా గట్టిగా బదులివ్వాలని స్పందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రారంభించినప్పుడు కచ్చితంగా ఆ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జిల్లాలకు వెళ్లి పాల్గొనాలని సూచించారు.       

Continues below advertisement

అసెంబ్లీలో ఏం జరిగింది?

ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బొండా ఉమ, బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ సహా ఇతర సభ్యులు చాలా తమ ప్రశ్నలతో సంచలనంగా మారారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ను ఇబ్బంది పెట్టేలా కొన్ని ప్రశ్నలను బొండా ఉమామహేశ్వరరావు సంధించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విషయంలో ప్రజల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయని ఎవరూ స్పందించం లేదని విమర్శించారు. సమస్య పవన్ దృష్టికి తీసుకెళ్దామన్నా సరే ఆయన అందుబాటులో ఉండటం లేదన్నారు. అది జరిగిన కొన్ని రోజులకే బాలకృష్ణ కూడా చిరంజీవిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇది కూడా రచ్చకు కారణమైంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి సర్ది చెప్పాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇకపై ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు చంద్రబాబు చర్యలు చేపట్టారు. కూటమి నేతల మధ్య విభేదాలు రాకుండా ఉండేలా ఇన్‌ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకోవాలని సూచించారు. శాఖలను టార్గెట్ చేసేలా ఎలాంటి విమర్శలు చేయొద్దని జాగ్రత్తలు చెప్పారు.