అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను రెండో రోజు సీఐడీ ప్రశ్నిస్తోంది. ఈ కేసులో ఆయన ఏ 14గా ఉన్నారు. తొలి రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించిన అధికారులు... రెండో రోజు కూడా ఆయన్ని సాయంత్రం వరకు విచారించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు లోకేష్‌ను న్యాయవాది సమక్షంలో విచారిస్తున్నారు. మొదటి రోజు లోకేష్ చెప్పిన సమాధానాల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలతో సీఐడీ అధికాలు విచారిస్తున్నారు.