Andhra Pradesh Weather: బంగాళాఖాతంలో వతావరణ పరిస్థితులు వేగంగగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నాలుగు రోజులు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, ఇది త్వరలోనే అల్పపీడనంగా, ఆ తర్వాత వాయుగుండంగా బపడుతనుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ అనూహ్య వాతవరణ మార్పుల దృష్ట్యా, ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రం, ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ వాతావరణ ప్రభావం కారణంగా మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని తర్వాత 48 గంటల్లో ఈ వ్యవస్థ పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రజలు, రైతులు అప్రమత్తం
ఈ వాయుగుండం ప్రభావంతో రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
రైతులకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. రైతులు, వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అన్నారు. పంట కోతలు, నిల్వలకు సంబంధించి సకాలంలో చర్యలు తీసుకోవాలని సూచించారు. పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. నాలుగు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉందని, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
జిల్లాల వారీగా నాలుగు రోజుల వర్షసూచనలు
రాష్ట్రంలో ఏఏ ప్రాంతాల్లో ఏ తేదీన ఎంత తీవ్రతతో వర్షాలు కురుస్తాయో విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది, ఈ వివరాలను గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సోమవారం వాతావరణం: సోమవారం నాడు బాపట్ల ,ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవాకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మంగళవారం వాతావరణం: మంగళవారం నాటికి వాయుగుండం మరింత బలపడటానికి వాతావరణం అనుకూలంగా ఉంది. దీంతో వర్షాల తీవ్రత కొంతమేర పెరుగుతుంది. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఇతర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికాటి నుంచి మేస్తరు వర్షాలు కురుసస్తాయి. అల్పపీడనం ఏర్పుతున్న దృష్ట్యా కోస్తా ప్రాంత ప్రజలు ఈ రోజు నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి.
బుధవారం వాతావరణం: పరిస్థితులు మరింతగా పలపడతాయి. బాపట్ల ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షఆలు నమోదు అవుతాయి. అనకాపల్లి, కాకినాడ, బీఆర్. అంబేద్క్ కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
గురువారం వాతావరణఁ: నాలుగు రోజుల హెచ్చరికల పరంపరలో గురువారం కీలకమైన రోజుగా అధికారులు అంచనా వేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయి.
వీటితో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురవొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని వివరించారు. వర్షాల ప్రభావం కోస్తా, రాయలసీమ జిల్లాలపై విపరీతంగా ఉండబోతోందని ఈ వివరాలను బట్టి స్పష్టమవుతోంది.