AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?

AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. సాగుతున్న వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేసింది.

Continues below advertisement

AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2(Group 2) నోటిఫికేషన్ వివాదాల మధ్య కొనసాగుతోంది. ఎప్పుడో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ పరీక్ష వాయిదా పడుతూ వస్తోంది. వివాదాలతో పరీక్ష వాయిదా పడుతూ వస్తోంది. గతేడాదిలో ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ నెల 23న మెయిన్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ వివాదాలు మాత్రం సమసిపోలేదు. రోస్టర్ విధానం సరిగా లేదని కొందరు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ విధానంలోనే కొనసాగితే తమ జీవితాలు నాశనమైపోతాయని వాపోతున్నారు. కాస్త ఆలస్యమైనా ప్రస్తుతానికి ఈ ఆదివారం జరిగే మెయిన్స్ పరీక్ష వాయిదా వేసి తప్పులను సరిచేయాలని అభ్యర్థిస్తున్నారు. వాళ్లకు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నారు. ఈ డిమాండ్ తీవ్రం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)కీలక నిర్ణయం తీసుకుంది. 

Continues below advertisement

మళ్లీ పోస్ట్, జోనల్ ప్రిపరెన్స్

వేల మంది అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. మరోసారి పోస్టు, జోనల్‌ ప్రిపరెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. పరీక్షలు రాసిన అనంతరం దీనికి అవకాశం ఇస్తామని పేర్కొంది. ఫలితాలు వచ్చిన తర్వాత సర్టిఫికేట్‌ వెరిఫికేషన్ సమయంలో ఈ ప్రక్రియ చేపడతామని తెలిపింది. ఇప్పటికే ఆలస్యం అయినందుకు పరీక్ష వాయిదా వేసేందుకు మాత్రం ఏపీపీఎస్సీ సిద్ధంగా లేదు అని అర్థమవుతుంది. తప్పులున్న ఉన్నమాట వాస్తమేనని అంగీకరించిన ఏపీపీసీఎస్సీ మధ్యే మార్గంగా ఈ ఆలోచన చేస్తోంది. 

23న మెయిన్స్ పరీక్ష 

గ్రూప్‌2 మెయిన్స్ పరీక్ష 92,250 మంది రాయబోతున్నారు. ఈ పరీక్ష ఈ ఆదివారం(ఫిబ్రవరి 23) నాడు జరగనుంది. రెండు పూటలు జరిగే పరీక్షల కోసం పదమూడు జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు.  ఈ పరీక్షనే వాయిదా వేయాలని అభ్యర్థులు హైకోర్టుకు కూడా వెళ్లారు. దీనిపై గురువారం తీర్పు వెల్లడించిన కోర్టు గ్రూప్‌ 2 వాయిదా వేయడానికి నిరాకరించింది. 

Also Read: మిర్చి క్వింటాకు రూ. 11,600 మించి వచ్చేలా చర్యలు- కేంద్రమంత్రి ప్రకటన

పరీక్ష వాయిదా కోరుతున్న అభ్యర్థులు 

గ్రూప్‌2 వాయిదా వేయడానికి కోర్టు, ఏపీపీఎస్సీ నిరాకరించడంతో అభ్యర్థులంతా రోడ్డుపైకి వచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉండి గ్రూప్‌ 2కి సిద్ధమవుతున్న వారంతా ఆందోళనలు చేపట్టారు. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని ప్రభుత్వమే అంగీకరించిన వేళ కచ్చితంగా వాయిదా వేయ్యాలని డిమాండ్ చేశారు. అన్ని తప్పులు సవరించిన తర్వాత పరీక్ష పెట్టడానికి ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. వాళ్ల ఆందోళనలకు కాంగ్రెస్, వైసీపీ మద్దతు ప్రకటించాయి. 

2023లో నోటిఫికేషన్...కొనసాగుతున్న వివాదం

ఇప్పుడు జరుగుతున్న పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ 2023లో వచ్చింది. డిసెంబర్ 7వ నోటిఫికేషన్ విడుదలైంది. తర్వాత ఏడాది అంటే 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష పెట్టారు. అనంతరం జరగాల్సిన మెయిన్స్ పరీక్ష ఈ రోస్టర్, మరికొన్ని కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఆ పరీక్ష ఇప్పుడు పెట్టేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. దీన్ని కూడా వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.   

Also Read: 23న ఏపీలో గ్రూప్‌ 2 - హైదరాబాద్‌లో అభ్యర్థుల ధర్నా- మద్దతు ప్రకటించిన షర్మిల

Continues below advertisement