Amaravati land acquisition | అమరావతి: "ఏసీ గదుల్లో కూర్చొని అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారికి ప్రజలే సమాధానం చెబుతారు, డిసెంబర్ 31 వరకు అన్ని టవర్లను పూర్తి చేస్తాం" అని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Narayana) అన్నారు. అమరావతి రాజధాని పరిధిలోని నేలపాడు ప్రాంతంలో గెజిటెడ్ అధికారుల ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఆర్‌డీఏ (CRDA) ఇంజినీర్లు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
భూసమీకరణ వల్ల రైతులకు లాభం
అమరావతి మునిగిపోయిందంటూ దుష్ప్రచారం జరుగుతోందని మంత్రి నారాయణ అన్నారు. రాజధాని నిర్మాణానికి కావలసిన మిగిలిన భూమిని భూసేకరణ ద్వారా పొందేందుకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. అయితే భూసేకరణ కంటే భూసమీకరణ వల్ల రైతులకు మరింత లాభం కలుగుతుందని స్పష్టం చేశారు. గెజిటెడ్ అధికారుల కోసం నిర్మిస్తున్న 14 టవర్లలో మొత్తం 1,440 ఇళ్లు నిర్మాణంలో.... టైప్-1 కేటగిరీలో 384 ఇళ్లు, టైప్-2 కేటగిరీలో 336 ఇళ్లు నిర్మిస్తున్నారు. అదేవిధంగా గ్రూప్-డి అధికారుల కోసం 720 ఇళ్లు నిర్మిస్తున్నారు. డిసెంబర్ 31 వరకు అన్ని టవర్లను పూర్తిచేసేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
"అమరావతిలో రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక వసతుల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి నాటికి నిర్మాణాలు పూర్తయి అధికారులకు గృహాలు అప్పగిస్తాం. ఐఏఎస్ అధికారుల టవర్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, ఐకానిక్ టవర్ల పనులు కూడా సమాంతరంగా సాగుతున్నాయి" అని మంత్రి నారాయణ వివరించారు.
మంత్రి నారాయణ కామెంట్స్...- అమరావతిలో గెజిటెడ్, గ్రూప్-డి అధికారుల కోసం మొత్తం 14 టవర్స్ లో 1440 ఇళ్లు నిర్మిస్తున్నాం- టైప్ -1 లో 384 ఇళ్లు,టైప్ - 2 లో 336 ఇళ్లు,గ్రూప్ - డి అధికారుల కోసం 720 ఇళ్లు నిర్మిస్తున్నాం- డిసెంబర్ 31 లోగా అన్ని టవర్ల ను పూర్తిచేస్తాం- రోడ్లు,డ్రెయిన్లు పనులు వేగంగా జరుగుతున్నాయి.- ఫిబ్రవరి 1 కి నిర్మాణం పూర్తి చేసి అధికారులకు అప్పగిస్తాం- IAS అధికారుల టవర్ల నిర్మాణం దాదాపు పూర్తయింది.- మొత్తం 4400 ఇళ్లలో 3750 ఇళ్లను వచ్చే మార్చి నాటికి అధికారులకు,ఉద్యోగులకు అప్పగిస్తాం- ట్రంక్ రోడ్లు ఏడాదిలో,లే అవుట్ రోడ్లు రెండున్నరేళ్లలో,ఐకానిక్ టవర్లను మూడేళ్లలో పూర్తి చేస్తాం- అమరావతి గురించి ఏసీ రూములో కూర్చుని కొంతమంది ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అమరావతి మునిగిపోయిందనీ దుష్ప్రచారం చేస్తున్నారు- అమరావతి రాజధాని గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే చీకొడతారు- అమరావతిలో మిగిలిన కొద్ది భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు అధారిటీ ఆమోదించింది- భూసేకరణ కంటే భూసమీకరణ వల్ల రైతులకు ఎక్కువ లాభం