AP Minister Nara Lokesh returns to AP after completing Davos visit | అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఐదు రోజుల దావోస్ పర్యటన ముగిసింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న నారా లోకేష్ పలువురు ప్రముఖులతో సమాదేశమై ఏపీలో పెట్టుబడులపై చర్చలు జరిపారు. దావోస్ పర్యటన ముగించుకున్న ఏపీ విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ స్వదేశానికి తిరిగొచ్చారు. శనివారం తెల్లవారుజామున 1.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేష్‌కు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు.
యువతకు ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా 4 రోజుల పాటు దావోస్ వేదికగా బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేశారు లోకేష్. ఏపీలో పెట్టుబడుల కోసం స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వెళ్లి రాష్ట్రంలో ఇన్వెస్ట్ మెంట్ కు ఉన్న అనుకూల పరిస్థితులను, కూటమి ప్రభుత్వ సహకారంపై దిగ్గజ సంస్థల అధినేతలతో నారా లోకేష్ సమావేశమై చర్చలు జరిపారు. త్వరలోనే వీటికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోనున్నారు.
పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీలు అవుతూనే మరోవైపు నారా లోకేష్ 8 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరై కూటమి ప్రభుత్వ పాలసీలు, చంద్రబాబు విజన్ ను వారికి వివరించారు జూన్ నెలలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తీసుకుంటున్న పారిశ్రామిక విధానాల నిర్ణయాలు, ప్రోత్సాహకాలు, పరిశ్రమల ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ (AI), క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, ఎకో ఫ్రెండ్లీ వ్యాపార అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో లోకేష్ చర్చలు జరిపారు.
దావోస్ లో జరిగిన పెట్టుబడుల చర్చలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దావోస్ లో బ్రాండ్ ఏపీని మంత్రి నారా లోకేష్ ప్రమోట్ చేసి పెట్టుబడుల కోసం శ్రమించారు. మొత్తం 30 మందికి పైగా గ్లోబల్ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీలలో పాల్గొని ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ప్రముఖులతో సమావేశం సందర్భంగా మంగళగిరి చేనేత కార్మికులు నేసిన శాలువాలలతో విదేశీ ప్రముఖులను సన్మానించి తన నియోజకవర్గ కళాకారులపై ప్రేమను చాటుకున్నారు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ టీ షర్ట్ ధరించి అరకు కాఫీని ప్రమోట్ చేశారా? వైరల్ ఫొటోలో నిజమెంత