Andhra Pradesh | మంగళగిరి : పోలీసు యంత్రాంగానికి మూడో కన్నులా సీసీ కెమెరాలు పనిచేస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి 55 కి.మీలకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టెక్నాలజీ సాయంతో ఎవరు, ఎక్కడ, ఏ తప్పు చేసినా ఆధారాలతో పట్టుకునే పరిస్థితి రావాలన్నారు. ఈగల్, శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని వారి సేవల్ని సీఎం చంద్రబాబు కొనియాడారు.
చైనాతో పోరాడుతూ అమరులైన భారత జవాన్లుప్రజల రక్షణ కోసం ఎల్లప్పుడూ ముందుండేది, విధి నిర్వహణ కారణంగా తమ కుటుంబంతో సరిగా గడపలేనిది పోలీసులేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. విధి నిర్వహణ కారణంగా తమ కుటుంబంతో సరిగా గడపలేని పరిస్థితి వారిదని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఆర్‌పీఎఫ్ దళాలు 1959 అక్టోబర్ 21న వీరోచిత పోరాటం చేశాయి. చైనా సైనికులపై జరిపిన పోరాటంలో 10 మంది భద్రతా సిబ్బంది దేశం కోసం అమరులయ్యారు. వారిని స్మరించుకుంటూ ప్రతి ఏడాది ఇదే రోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారి నుంచి మనం స్ఫూర్తి పొందాలన్నారు.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా 192 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారు. ప్రజల ప్రాణ రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు. రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజం, గంజాయి లాంటి బ్యాచ్‌లను అణచివేయడంలో పోలీసులు రాణిస్తున్నారు. వారి సంతోషాన్ని త్యాగం చేసి మరి పోలీసులు మన ప్రాణాలు కాపాడుతున్నారు. పోలీసులు అనగానే కఠినంగా ఉంటారని భావిస్తాం. కానీ ఎంతో మానవత్వంతో వ్యవహరించి విధి నిర్వహణలో శ్రమించేది వాళ్లే. విజయవాడలో పిల్లలు చెప్పులు లేకుండా వెళ్తుంటే చూసి చలించిపోయిన హెడ్ కానిస్టేబుల్ వారికి చెప్పులు కొనిచ్చి వారి ముఖాల్లో సంతోషాన్ని నింపారు.
విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. దుబాయ్, అబుదాబి, యూఏఈలో పర్యటించనున్నారు. నవంబర్‌లో విశాఖలో జరిగే సీఐఐ సమ్మిట్‌లో పాల్గొనాలని విదేశీ పెట్టుబడుదారులను ఆహ్వానించనున్నారు.