AP CS Jawahar Reddy Review Meeting: కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ఆధారిత విద్యాబోధన వైపు అవసరం అయిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


AI పై సీఎస్ సమీక్ష... 
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో కృత్రిమ మేధస్సు ఆధారిత విద్యా బోధన విధానం అమలు, భవిష్యత్ కార్యాచరణ పై  ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర విద్యా శాఖ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు ద్వారా విద్యాబోదనకు తీసుకోవాల్సిన చర్యలు పై చర్చించారు. పాఠశాల విద్యా, కళాశాల విద్యాశాఖ లు తగిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎస్ సూచించారు. దీని అమలుకు సంబంధించి ఇటు విద్యార్ధుల్లో, అటు తల్లిదండ్రుల్లో నూ పూర్తి స్థాయిలో కెపాసిటీ బిల్డింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి టెక్నికల్ బోర్డులను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని దాని పై తగిన ప్రతిపాదనలను సిద్దం చేయాలని, సీఎస్ జవహర్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 


మొబైల్ యాప్ ల ద్వారా...
విద్యా విధానంలో తీసుకువస్తున్న మార్పులకు అనుగుణంగా అధికారులు మొదలకొని విద్యార్థుల వరకు ప్రత్యేకంగా శిక్షణ అవసరం అని సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. మొబైల్ యాప్‌ల నుంచి ఆన్‌లైన్ కోర్సుల వరకు విద్యలో కృత్రిమ మేధస్సు(AI) వినియోగం విపరీతంగా పెరుగుతోందని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ విద్యా వ్యవస్థలో AIని అమలు పై ఆసక్తి చూపుతున్నారన్నారని, విద్యార్థులు, తల్లిదండ్రులకు కృత్రిమ మేధస్సు గురించి అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 


పరిశోధనలుపై కూడా ఫోకస్...
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామల రావు మాట్లాడతూ.. కృత్రిమ మేధస్సుపై అన్ని విశ్వవిద్యాలయాల్లోను ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. టెక్నికల్ ల్యాబ్, పరిశోధనకు సంబంధించి వీఆర్, ఏఆర్ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్సులో విశ్వవిద్యాలయాల్లో గ్లోబల్ స్టాండర్డుతో కూడిన శిక్షణను అందించే ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యమండలి అధ్యక్షలు హేమచంద్రా రెడ్డి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు కోర్సును ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టామని దీని పై విద్యార్ధుల్లో మరింత కెపాటిసిటీ బిల్డింగ్ కు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.ఈ విధానంతో రీసెర్చ్ మెథడాలజీని మెరుగు పర్చేందుకు, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ కు, పెర్సనలైజ్డ్ లెర్నింగ్ ఎక్సఫీరియెన్సెస్ కు కృషి చేస్తున్నట్టు తెలిపారు. 
Also Read:  అటు వరద బాధితులకు పరామర్శ, ఇటు పార్టీ వ్యవహారాలతో బిజీబిజీగా సీఎం జగన్


రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య  కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్సు అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. గ్లోబల్ ప్రాముఖ్యత కలిగిన ఉపాధ్యాయులతో ప్రతి ఫాఠ్యాంశానికి సంబంధించి ప్రీ రికార్డెడ్ వీడియో రూపొందించి విద్యార్ధులకు విద్యాబోధన చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్సు ద్వారా విద్యా బోధనకు సంబంధించి వివిధ అంశాల ప్రవీణ్ ప్రకాష్ నివేదికను సమర్పించారు.