Tulasi Reddy sensational Comments againt 3 Capitals for AP: అసెంబ్లీ ఉన్న ప్రాంతాన్ని శాసన రాజధాని అనరు, అసెంబ్లీ అని మాత్రమే అంటారని, హై కోర్టు ఉన్న ప్రాంతాన్ని న్యాయ రాజధాని అనరని, హై కోర్టు అని మాత్రమే అంటారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అభిప్రాయపడ్డారు. పరిపాలన రాజధాని (రాష్ట్ర సచివాలయం)ఉన్న ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారని తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చెబుతున్న మూడు రాజధానుల మాట ఒక నాటకం అని, వికేంద్రీకరణ పాట ఒక బూటకం అంటూ మండిపడ్డారు. విషయం తెలియకుండా ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర మంత్రులు 3 రాజధానుల జపం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.


పలు రాష్ట్రాల్లో రాజధానుల వెలుపల హై కోర్టులు.. 
హైకోర్టు ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర రాజధాని అనరని చెప్పారు. కేరళ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అస్సాం తదితర 13 రాష్ట్రాల్లో రాజధానుల వెలుపల హై కోర్టు లు ఉన్నాయని, వాటిని రాజధానులు అనడం లేదని చెప్పారు. కేరళ హైకోర్టు కొచ్చిన్ లో ఉందని, కానీ కొచ్చిన్ ను కేరళ రాజధాని అనరని, రాష్ట్ర సచివాలయం ఉన్న త్రివేండ్రం ను మాత్రమే కేరళ రాజధాని అంటారని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇకనైనా ఈ విషయాలను గుర్తించాలని తులసి రెడ్డి సూచించారు.


అసెంబ్లీ భవనం ఉంటే రాజధాని అనలేదు 
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో గమనిస్తే.. అసెంబ్లీ భవనం ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర రాజధాని అనలేదు. కర్ణాటకలో బెంగళూరు లో, బెల్గాంలో అసెంబ్లీ భవనాలు ఉన్నాయని.. అసెంబ్లీ భవనం ఉన్న బెల్గామ్ ను కర్ణాటక రాజధాని అనరని చెప్పారు. రాష్ట్ర సచివాలయం ఉన్న బెంగళూరును మాత్రమే కర్ణాటక రాజధానిని వ్యవహరిస్తున్నారని గుర్తుచేశారు. కనుక ఇప్పటికైనా పరిపాలన రాజధాని, శాసన రాజధాని, న్యాయ రాజధాని అనే పడికట్టు పదాలను వైసీపీ ప్రభుత్వం మానుకోవాలన్నారు. పరిపాలన రాజధాని (రాష్ట్ర సచివాలయం)ఉన్న ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారని స్పష్టం చేశారు.


హై కోర్టు ఉన్న ప్రాంతాన్ని హైకోర్టు అంటారంతే ! 
అసెంబ్లీ ఉన్న ప్రాంతాన్ని శాసన రాజధాని అనరు, అసెంబ్లీ అని మాత్రమే అంటారని, హై కోర్టు ఉన్న ప్రాంతాన్ని న్యాయ రాజధాని అనరని, హై కోర్టు అని మాత్రమే అంటారని తులసి రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సచివాలయం ఉన్న ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం ఇకనైనా ఈ విషయాలు గ్రహించి, 3 రాజధానుల నాటకాన్ని కట్టిపెట్టాలన్నారు. లేకపోతే భవిష్యత్తులో రాష్ట్రం మరింత నష్టపోయే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


మీ రాజధాని ఏదంటూ ఆట పట్టిస్తున్నారు ! 
తెలుగు జాతి అంటే చులకన అయిపోయింది అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాల వారి దగ్గర అవమానాలు పొందే పరిస్థితిలో మనం ఉన్నామన్నారు. ‘‘మనలో ఐక్యత లేదు, ప్రతిదానికి కులం, రాజకీయం, స్వార్థం. మా కుమార్తె దిల్లీలోని కాలేజీలో చదువుతోంది. మా కుమార్తెను తోటి విద్యార్థులు మీ రాజధాని ఏదంటూ ఆట పట్టిస్తున్నారు. పిల్లలు కూడా తలదించుకునే స్థితిలో మనం ఉన్నాం. ఇలాంటి అవలక్షణాలను మార్చాల్సిన బాధ్యత రచయితలపై ఉంది. ప్రజలను చైతన్యపరిచే శక్తి కవులకు మాత్రమే ఉంది’’ అంటూ జస్టిస్ బట్టు దేవానంద్ తెలిపారు. విజయవాడలో  ప్రపంచ రచయితల సంఘం పుస్తకావిష్కరణ సభ సందర్భంగా హైకోర్టు జడ్జి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.