వరుస సమావేశాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బిజీబిజీగా ఉంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశం అయిన జగన్ మరుసటి రోజే రీజినల్ కో ఆర్డినేటర్లతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
రీజినల్ కో ఆర్డినేటర్లతో సమావేశం....
వైసీపీ శాసన సభ్యులతో సోమవారం సమావేశం అయిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, అదే ఊపులో రీజినల్ కో ఆర్డినేటర్ల తో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలను మరింతగా వేగవంతం చేయటం, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లతో పాటుగా పార్టీలోని సీనియర్ లను కలుపుకొని వ్యూహాత్మకంగా స్థానిక పరిస్థితులను ఏప్పటికప్పుడు అంచనా వేసుకొని, రాజకీయం నడిపంచటం వంటి అంశాల పై జగన్ దిశానిర్దేశం చేస్తారని పార్టీ నేతలు అంటున్నారు.
కీలక సమావేశం...
పార్టీ కార్యక్రమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ఎమ్మెల్యేలతో రోజు టచ్ లో ఉండేలా రీజినల్ కోఆర్డినేటర్లకు ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు అప్పగించనున్నారు. వాలంటీర్లు , గృహ సారథులును సమన్వయం చేసుకుని కార్యక్రమాలపై దృష్టి పెట్టేలా చూడాలని సమావేశంలో చెప్పనున్నారు జగన్ మోహన్ రెడ్డి. త్వరలో ప్రారంభం అయ్యే జగనన్నే మన భవిష్యత్.. జగనన్నకు చెబుదాంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ రీజనల్ కో ఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. సీఎం జగన్ జిల్లా పర్యటలో కూడా ఎమ్మెల్యేలు స్థానిక నేతలను సమన్వయం చేసుకునేలా రీజనల్ కో ఆర్డినేటర్లకు బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఎమ్మెల్సీ ఫలితాల తరువాత అలర్ట్...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తరువాత జగన్ మరింత అప్రమత్తం అయ్యారని పార్టీలోనూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మరో ఏడాదిలో ఎన్నికలు ఉంటాయని స్పష్టంచేసిన జగన్ ఆ దిశగా పార్టీని మరింతగా సమర్దవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టారు. అధికారిక కార్యక్రమాల్లో మార్పులు తీసుకువచ్చి, పార్టీకి ఎక్కువ సమయం ఇచ్చేలా జగన్ రూట్ మ్యాప్ ను డిసైడ్ చేశారని అంటున్నారు. దీంతో పాటుగా రాబోయే రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన అంశాలు కీలకంగా మారుతున్న పరిస్థితుల్లో పార్టీలో నాయకత్వం, నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఇంచార్జ్ ల పని తీరు వంటి వివరాలను జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
నాలుగు కేటగిరీలుగా ఎమ్మెల్యేలు..
ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ నాలుగు కేటగిరీలుగా పార్టీ శాసన సభ్యులను విభజించారని వినిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలను, ఇంచార్జ్ లను నాలుగు వర్గాలుగా విభించి వారిని ఆయా వర్గాల వారీగా ట్రీట్ చేయాలని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో మెదటి క్యాటగిరి, సీట్ ఇస్తే గెలిచేవారు. రెండో ది సీట్ ఇస్తే ఓడిపోయేవాళ్ళు, మూడోది సీట్ ఇవ్వకపోతే వేరే పార్టీ లో చేరేవారు. నాలుగోది పార్టీ లోనే ఉండి నష్టం కలిగించేవారు. ఇలా నాలుగు రకాలుగా ఎమ్మెల్యేల విభజన చేపట్టి వారిని ఆయా పరిస్థితులకు అనుగుణంగా పని చేయించుకోవటం, లేదంటే ఎన్నికల సమయంలో పూర్తిగా పక్కన పెట్టడం లాంటి అంశాలపై జగన్ కీలక సమావేశంలో శాసన సభ్యులకు ప్రత్యక్ష్యంగా పరోక్షంగా స్పష్టం చేయనున్నారని తెలుస్తోంది. పనితీరు మాత్రమే కొలమానం అని పుకార్లకు పూర్తి దూరంగా ఉండాలని జగన్ ఇప్పటికే శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
YS Jagan: బిజీబిజీగా సీఎం జగన్ - నిన్న ఎమ్మెల్యేలతో, నేడు రీజనల్ కోఆర్డినేటర్లతో కీలక సమావేశం
Harish
Updated at:
04 Apr 2023 10:48 AM (IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బిజీబిజీగా ఉంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశం అయిన మరుసటి రోజే రీజినల్ కో ఆర్డినేటర్లతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
NEXT
PREV
Published at:
04 Apr 2023 10:43 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -