AP Politics: పాతిక ఓట్ల మెజార్టీతో గెల్చుకున్న ఆ నియోజకవర్గంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆ నియోజకవర్గ శాసన సభ్యునికి సైతం నెక్ట్స్ నో సీట్ అని చెప్పేశారనే ప్రచారం జరుగుతోంది.
25 ఓట్లతో గెల్చుకున్న సీటుపై జగన్ కీలక నిర్ణయం...
2019 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన 151మంది శాసన సభ్యులను గెలిపించటం ఒక రికార్డ్ గా మారింది. అలాంటి రికార్డ్ లను మరిన్ని బ్రేక్ చేయాలనే కాన్సెప్ట్ తో ఉన్న జగన్ ఈ సారి వై నాట్ 175 అనే స్లోగన్ ను తీసుకొచ్చారు. దీంతో ఇక ప్రతి నియోజకవర్గం కీలకంగా మారింది. ఏదోలా గెలిచేద్దాం అంటూ బ్లైండ్ గా దూసుకుపోవాలనే ధోరణిలో జగన్ అస్సలు లేరని పలు సందర్బాల్లో బహిర్గం అవుతుంది. తాజాగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కొక్కటి బయకు వస్తున్న క్రమంలో వై నాట్ 175 టార్గెట్ లో జగన్ ఎంత పక్కాగా ఉంటున్నారో చెప్పకనే చెబుతున్నారు. అలాంటి సందర్బమే బెజవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బయటకు వచ్చిందని పార్టి నేతలు అంటున్నాురు.
గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 25 ఓట్ల మెజార్టీతో గెల్చుకుంది. అది రెండు సార్లు రీ కౌంటింగ్ తరువాత.. ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తరువాత అప్పట్లో తెలుగుదేశం పార్టీ సిట్టిగ్ శాసన సభ్యుడు బోండా ఉమా గెలిచినట్లుగా ఎన్నికల అధికారి సైతం ప్రకటించారు. అయితే మరో సారి రీ కౌంటింగ్ పెట్టటంతో ప్రభుత్వ ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్ పుణ్యమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు మల్లాది విష్ణు విన్ అయ్యారు. 25 ఓట్లతో గెల్చినట్లుగా ప్రకటించారు, అఫిడవిట్ ఇవ్వటంతో నాటకీయ పరిణామాలకు తెర పడింది. అయితే ఇప్పడు అదే విజయవాడ సెంట్రల్ సీటు ను తిరిగి కైవసం చేసుకునేందుకు టీడీపీ మాజీ శాసన సభ్యుడు బోండా ఉమా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్లతో ఓడిపోవటంతో ఆ మెజార్టీని అధిగమించేందుకు బోండా అన్ని రకాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఈసారి వైసీపీకి చాలా కీలకం..
ఈ సారి 175సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా భావిస్తున్న క్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీటు బాధ్యతల నుండి మల్లాది విష్ణును తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వినిపిస్తోంది. ఈ మేరకు జగన్ ఇప్పటికే ప్రైవేట్ సర్వే చేయించారని అంటున్నారు. మల్లాది విష్ణు, దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. ఆయన చనిపోయిన తరువాత విష్ణు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి జగన్ వెంట నడిచారు. వైఎస్ ఫ్యామిలికి మోస్ట్ వాంటెడ్ జాబితాలో మల్లాది విష్ణు పేరు ఉంటుంది. అలాంటి కీలకమయిన నేతకు సైతం టిక్కెట్ డౌట్ అని జగన్ ముందుగాను చెప్పేశారని అంటున్నారు. అందులో భాగంగానే మల్లాది విష్ణుకు ఇప్పటికే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలను జగన్ అప్పగించారని అంటున్నారు.
ఈ నియోజకవర్గంలో తెలుగు దేశం బలంగా ఉండటం ఒక ఎత్తయితే, అదే సమయంలో అధికార పార్టికి చెందిన కార్పోరేటర్లకు , ఎమ్యెల్యే విష్ణుకు మధ్య గ్యాప్ ఏర్పడిందనే కారణాలు కూడ ఉన్నాయని చెబుతున్నారు. సో టార్గెట్ 175 లో భాగంగా బెజవాడ లో అత్యంత కీలకం అయిన సెంట్రల్ నియోజకవర్గ సిట్టింగ్ శాసన సభ్యుడికి సీట్ ను మార్చి వేరొకరికి సీటును కేటాయించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial