అమరావతిలోని ఆర్-5 జోన్‌లో సెంటు స్థలాల పంపిణీకి కోర్టు అడ్డంకులు తొలగిపోవడంతో ప్రభుత్వం వేగం పెంచింది. ఈ నెల 26న పట్టాల పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. దీనిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 


ఆర్-5 జోన్‌ హౌసింగ్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించి ప్రక్రియ  పురోగతిని తెలుసుకున్నారు. పంపిణీకి ముందు జరగాల్సిన ప్రక్రియ గుర్తించి ఆరా తీశారు. సుమారు 50 వేల మందికి ఈ పట్టాలు పంపిణీ చేయనున్నారు. 


సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘించి ఆర్-5 జోన్‌ను ఏర్పాటు చేసి సెంటు పట్టాలను పంపిణీ చేస్తున్నారని అమరావతి రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో తాము పేదలకు పట్టాలు పంపిణీ చేసేశామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. విచారణలో ఉండగా ఎలా సాధ్యమని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వాదనల తర్వాత సెంటు స్థలాల పంపిణీ విషయంలో జోక్యం  చేసుకోబోమన్న సుప్రీంకోర్టు....  భూయాజమాన్య హక్కులు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.