టెక్నాలజీ పరంగా ఏపీలో ఒక కీలక ఘట్టం జరుగబోతోంది. భవిష్యత్తు గేమ్ చేంజర్ గా చెబుతున్న క్వాంటం కంప్యూటర్ ను ఈరోజు సీఎం చంద్రబాబు అమరావతిలో ప్రారంభించబోతున్నారు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రమోట్ చేస్తున్న  క్వాంటం వ్యాలీ లో దీని తొలి అడుగుగా చెప్పొచ్చు.

Continues below advertisement

ఏంటీ క్వాంటం కంప్యూటర్ ?

 సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్ ల కంటే చాలా అడ్వాన్స్డ్ గా పనిచేసే కంప్యూటర్ నే క్వాంటం కంప్యూటర్ అంటారు. ప్రస్తుతం ఉన్న కంప్యూటర్లు  ప్రాసెసింగ్ పరంగా 0,1 బైనరీల లో డేటాను ప్రాసెస్ చేస్తాయి. కానీ క్వాంటం కంప్యూటర్ అనేది  ఆ రెండిటితోపాటు  వాటి మధ్య ఉండే క్యూబిట్స్ (క్వాంటం బిట్స్ ) స్థాయిలో ప్రాసెస్ చేస్తుంది. దీనివల్ల కలిగే ప్రధానమైన ప్రయోజనాలు ఇవే.

Continues below advertisement

1)  డేటా ప్రాసెసింగ్ మరింత ఖచ్చితత్వంతో జరుగుతుంది 

2) మామూలు కంప్యూటర్ లకంటేచాలా వేగంగా పనిచేస్తుంది 

3) డేటాను మరింత సురక్షితంగా ఉంచగలుగుతుంది 

ఒకేసారి రెండు చోట్ల ప్రారంభించనున్న చంద్రబాబు 

 అమరావతి కేంద్రంగా ఆవిష్కృతం అవుతున్న క్వాంటం రిఫరెన్స్‌ ఫెసిలిటీతో టెక్ శకంలో నూతన అధ్యాయానికి నాంది పడనుందని చంద్రబాబు చెబుతున్నారు.. గన్నవరంలోని మేధా టవర్స్ తో పాటు రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్‌ లో ఏర్పాటు అవుతున్న 1S , 1 కQ పేరిట రెండు వేర్వేరు క్వాంటం టెస్టింగ్ రిఫరెన్సు ఫెసిలిటీలను అయన ఆవిష్కరించనున్నారు. దీంతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్‌ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది. దేశీయంగా తయారైన ఈ క్వాంటం రిఫరెన్స్‌ టెస్ట్ ఫెసిలిటీతో క్వాంటం కంప్యూటర్ హార్డ్ వేర్ ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్ధ్యం అమరావతి క్వాంటం వ్యాలీకి రానుంది.

మేధాటవర్స్ లో క్యూబిటెక్ సంస్థ,  ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లు ఏర్పాటు చేస్తున్న ఈ క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీ టెస్ట్ బెడ్ లు క్వాంటం హార్డ్ వేర్ తయారీలో కీలకం కానున్నాయి. ఈ రెండు చోట్లా మైనస్ 273 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో పనిచేసే మినీ క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ లు క్వాంటం ఉపకరణాలను పరీక్షించేలా తోడ్పాటు అందించనున్నాయి. క్వాంటం కంప్యూటర్  ఉపకరణాలు తయారు చేసే కంపెనీలతో పాటు పరిశోధకులు, విద్యార్ధులు, నిపుణులకు ఉపయోగపడేలా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఓపెన్ యాక్సెస్ రిఫరెన్సు ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. 

స్వదేశీ టెక్నాలజీతో రిఫరెన్సు ఫెసిలిటీఅమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఈ రెండు క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీల్లోనూ పూర్తిగా స్వదేశంలో తయారైన ఉపకరణాలనే ఉపయోగించారు. మేధాటవర్స్ లో క్వూబిటెక్ సంస్థ 1 క్యూ పేరిట క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ ను ఏర్పాటు చేసింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లో 1 ఎస్ పేరిట సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో క్వాంటం టెస్ట్ బెడ్ ను నిర్మించారు. ఈ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీల ఏర్పాటులో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డీఆర్డీఓ లాంటి సంస్థలు సహకారం అందించాయి.

దేశంలోనే తొలిసారిగా ఏర్పాటైన ఈ టెస్ట్ బెడ్ ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్ సహా, ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటం రంగంలోని పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, క్వాంటం ఇన్నోవేషన్ స్టార్టప్ ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరు కానున్నారు. ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వర్చువల్ గా దాదాపు 1.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు  సీఎం చంద్రబాబు అమరావతిలోని SRM యూనివర్సిటీ నుంచి ఈ క్వాంటం కంప్యూటర్ ను ప్రారంభించబోతున్నారు.