Viral Video: సీరియస్ పొలిటీషియన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ సరదా వీడియో షేర్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ రాసిన డైలాగ్స్‌కు ఓ నెటిజన్ ఏఐతో విజువలైజ్ చేశాడు. ఆ వీడియోను ముఖ్యమంత్రి చంద్రబాబు షేర్ చేశారు.  నవ్వు ఆపోకోలేకపోతున్నానని చెబుతూ చంద్రబాబు షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్‌గా మారుతోంది. 

Continues below advertisement

ఎప్పుడో పాతికేళ్ల కిందట వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో వెంకటేష్ ఫేమస్ సీన్ ఒకటుంటుంది. వెంకటేష్ కలెక్టర్ అయిపోయి చంద్రబాబుతో మీటింగ్ అంటూ ఒక డైలాగ్ చెబుతారు. ఆ సందర్భంగా "చంద్రబాబూ.. బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు.. " అనే డైలాగ్‌తో ఉండే ఆ సీన్ ఇప్పటికీ చాలా ఫేమస్. దాన్ని మీమర్స్ చాలా రకాలుగా వాడుతుంటారు. ఆ సీన్‌ను ఓ సోషల్‌ మీడియా యూజర్.. ఏడాది వయసున్న తన కుమార్తె ఆర్నాకు అప్లై చేసి వీడియో క్రియేట్ చేశారు. 

తన కుమార్తె ఆర్నా కలెక్టర్ అయిపోయినట్లుగా AI వీడియో క్రియేట్ చేసిన నెటిజన్ దాన్ని నెట్‌లో షేర్ చేశారు. అది చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన కూడా ఫన్నీగా ఆ వీడియో తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. ఆర్నాను అఫీషియల్‌గా రూట్‌ చేస్తాను  అని చెప్పారు.