సినిమా కంటెంట్‌ తెలిసిపోయింది. ఎవరిని టార్గెట్ చేస్తున్నారో అర్థమైపోయింది. ఇప్పటి వరకు నడిచిన ఊహాగానాలకు తెరదించారు వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టుగానే ఆయనో ట్వీట్ చేశారు. ఏ కాన్సెప్ట్‌లో సినిమా తీస్తున్నానో చెప్పేశారు. 


వివాదాలకు వెతుక్కొని వెళ్లి మరీ కెలుక్కొని రామ్‌గోపాల్ వర్మ మరోసారి రాజకీయాలను టచ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం సీఎం జగన్‌తో సమావేశమైన అనంతరం రాజకీయాలపై సినిమాలు వస్తున్నాయన్న ఊహాగానాలకు తెరలేచింది. ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు.. ఎవరిపై సినిమాలు తీస్తారనే చర్చ జోరుగా నడిచింది. 


ఈ చర్చ నడుస్తుండగానే... ఆర్జీవీ గురువారం వరసు ట్వీట్లతో తాను చేయబోయే సినిమాలపై క్లారిటీ ఇచ్చేచారు. దాచుకోవడానికి ఏం లేదని... తాను రాజకీయాలపై సినిమా తీయబోతున్నానని చెప్పేశారు. పనిలో పనిగా పేర్లు కూడా ప్రకటించేశారు. రాజకీయాలపై తాను తీయబోయే సినిమా టూ పార్ట్స్‌లో ఉంటుందని వివరించారు ఆర్జీవీ. 


ఇవాళ మరో ట్వీట్ చేసిన ఆర్జీవీ తాను తీయబోయే వ్యూహం సినిమాలో ఎలాంటి కంటెంట్‌ ఉంటుందో వివరించారు. BJP ÷ PK  x CBN - LOKESH  + JAGAN = వ్యూహం అంటూ ఓ కన్ఫ్యూజింగ్‌ స్టేట్‌మెంట్‌ పాస్ చేశారు. 






సీఎం జగన్‌తో భేటీ తర్వాత జగన్ తాను ఎలాంటి సినిమా తీయనున్నారో వెంటనే ప్రకటించారు. తన కొత్త సినిమాకు "వ్యూహం" అని పేరు పెట్టారు. తాను తీయబోయేది బయోపిక్ కాదు…బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని ఆర్జీవీ ప్రకటించారు. బయో పిక్‌లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయని ప్రకటించారు. అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి “వ్యూహం” కథ వచ్చిందన్నారు. రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందన్నారు. రాచకురుపుపైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి  ప్రతికాష్టే  “వ్యూహం” చిత్రం అని ఆర్జీవీ  ప్రకటించారు. 


సినిమాకు నిర్మాతగా దాసరి కిరణ్ ఉంటారని ఆర్జీవీ ప్రకటించారు. అయితే ఈ రియల్ పిక్ ఒక సినిమా కాదని రెండు సినిమాలని చెబుతున్నారు.  వ్యూహం .., తర్వాత శపథం అని రెండు సినిమాలు ఉంటాయన్నారు. ప్రేక్షకులకు షాక్ ఇస్తామన్నారు రామ్‌గోపాల్ వర్మ.