Andhra Pradesh CM Chandra Babu Latest News: మారుతున్న కాలానికి అనుగుణంగా పని వాతావరణం మార్చుకుంటే అద్భుతాలు సాధించి వచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. కరోనా తర్వాత వర్క్ కల్చర్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని గుర్తు చేసిన ఆయన వాటిని ఇప్పుుడు ఆంధ్రప్రదేశ్‌లో విరివిగా వాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ముఖ్యంగా మహిళల విషయంలో ఇది మరింత వేగంగా జరగాలని అభిప్రాయపడ్డారు. 


మహిళలకు సైన్స్ డే శుభాకాంక్షలు


అంతర్జాతీయ మహిళా బాలికల సైన్స్‌ దినోత్సవం సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు రాష్ట్రంలో తీసుకురాబోతున్న మార్పులు గురించి వివరించారు. మహిళలు, యువత, బాలికలు సాధించిన విజయాలను గుర్తు చేసుకోదగ్గ రోజు అని తెలిపారు. అంతే కాకుండా వారికి మరిన్ని అవకాశాలు అందించి మరింత ఉన్నతికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.  


మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుందాం


నేటి వర్క కల్చర్‌లోకి మహిళలను భారీగా తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో భారీ ఎత్తున వర్క్‌ఫ్ర హోమ్ కల్చర్‌ డెవలప్ చేయడానికి చర్యలు చేపట్టబోతున్నట్టు పేర్కొన్నారు. కరోనా తర్వాత పని విధానంలో చాలా మార్పు వచ్చిందని అన్నారు. పనితనాన్ని సులభంగా తెలియజేసేందుకు అవసరైన సాంకేతికత కూడా అందుబాటులోకి వచ్చిందని గుర్తు చేశారు. వర్క్‌ ఫ్రమ్‌హోంకు ప్రాధాన్యత కూడా పెరిగిందని వెల్లడించారు. రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేస్‌లు, నైబర్‌హుడ్ వర్క్‌స్పేస్‌లు వంటి భావనలు విస్తృతమవుతున్నాయని తెలిపారు. అవి వ్యాపారాలను, ఉద్యోగాలను సులభతరం చేస్తున్నాయని అన్నారు. 




మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది


ఇలాంటి సౌకర్యవంతమైన సాంకేతికత వర్క్‌లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకొని వృద్ధిలోకి రావడానికి సహాయపడుతుందన్నారు. వీటితోనే APలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్ IT & GCC పాలసీ 4.0 అడుగులు వేయబోతోందన్నారు. ప్రతి నగరం/పట్టణం/మండలంలో ఐటీ కార్యాలయాలు స్థాపించడానికి, ఉపాధి సృష్టించడానికి ఐటీ/జిసిసి సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వెల్లడించారు. ఈ చర్యల వల్ల మహిళా నిపుణుల భాగస్వామ్యం పెంచుతాయని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. రిమోట్/హైబ్రిడ్ పని ఆప్షన్‌తో వారే ఎక్కువ ప్రయోజనం పొందుతారని సీఎం చంద్రబాబు ఆశించారు. 


Also Read: ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్‌ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?