AP Assembly Session Live: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ రేపటి వాయిదా - స్పీకర్‌గా నామినేషన్ వేసిన అయ్యన్న

Andhra Pradesh Assembly Session LIVE Updates: ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల తాజా అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

Continues below advertisement

LIVE

Background

Andhra Pradesh Assembly Session LIVE Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మధ్య విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణం చేయనున్నారు. 9.45 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో మొదట ప్రొటెం స్పీకర్‌ను సభకు పరిచయం చేస్తారు. అనంతరం ఆయన్ని మర్యాదపూర్వకంగా స్పీకర్ సీట్లో కూర్చోబెడతారు. తర్వాత ఆయన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. 

ముందుగా హోదా ప్రకారం సీఎం చంద్రబాబు ప్రమాణం చేస్తారు. తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ ప్రమాణం చేయనున్నారు. వీళ్లిదరి తర్వాత ఆల్ఫాబేటిక్ ఆధారంగా ఒక్కొక్కర్నీ పిలించి ప్రమాణం చేయిస్తారు. 

సాధారణంగా ప్రతిపక్ష నేతకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈసారి అసెంబ్లీలో ప్రతిపక్షం హోదా ఉన్న పార్టీ లేదు. వైసీపీకి 11 సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదా రాలేదు. 17 సీట్లు వచ్చి ఉంటే ప్రతిపక్ష హోదా వచ్చేది. ఈసారి ఓడిపోయిన వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కనందున ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ సాధారణ ఎమ్మెల్యేగానే ప్రమాణం చేస్తారు. 

175 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో 164 సీట్లను కూటమిగా పోటీ చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన గెలుచుకున్నాయి. వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 164 సీట్లలో టీడీపీ 135 మంది టీడీపీ సభ్యులు, 21 మంది జనసేన సభ్యులు, 8 మంది బీజేపీ సభ్యులు ఉంటారు. 

ఇవాళ సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత సాయంత్రానికి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్పీకర్‌గా చేయాలని ఆసక్తి ఉన్న వాళ్లు, లేదా పార్టీలు ఎంపిక చేసిన వ్యక్తులు నామినేషన వేశారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని స్పీకర్‌గా చేస్తారని తెలుస్తోంది. సాయంత్రం ఆయన నామినేషన్ వేయనున్నారు. మెజార్టీ కూటమిదే ఉన్నందున వేరే వాళ్లు అభ్యంతరం చెప్పే అవకాశం లేదు. ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. రెండో రోజు సభలో స్పీకర్ ఎన్నిక జరిపిన తర్వాత ప్రొటెం స్పీకర్‌ ఆ వ్యక్తిని సీట్లో కూర్చోబెట్టి తను బాధ్యతలను నుంచి తప్పుకుంటారు. స్పీకర్ ఎన్నిక పూర్తైన తర్వాత ఆయనను ఉద్దేశించి సభలో సభ్యులు మాట్లాడతారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. మళ్లీ జులైలో జరిగే బడ్జెట్‌ కోసం సభ సమావేశం కానుంది. 

ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరితో గురవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ప్రస్తుతం సభలో ఉన్న సభ్యుల్లో ఆయనే సీనియర్ కావడంతో ఆయన్ని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశారు. చంద్రబాబు సీనియర్ అయినప్పటికీ సభాధ్యక్షుడు కావడంతో తర్వాత స్థానంలో ఉన్న బుచ్చయ్యచౌదరికి ఈ అవకాశం దక్కింది. 

Continues below advertisement
10:29 AM (IST)  •  21 Jun 2024

Jagan Oath Taking: ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన జగన్ 

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రుల తర్వాత వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. వాస్తవంగా అల్ఫాబేటిక్ ఆర్డర్‌లో సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి ఉండాల్సింది కానీ వైసీపీ అభ్యర్థన మేరకు ఆయనతో ముందుగానే ప్రమాణం చేయించారు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం ముటకట్టుకున్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. దీంతో ఆయన సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగాల్సి వస్తోంది. 

10:11 AM (IST)  •  21 Jun 2024

ప్రమాణం చేసిన 24 మంది మంత్రులు

ఎమ్మెల్యేలుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తోపాటు ఇతర మంత్రులు కూడా ప్రమాణం చేశారు. 

10:10 AM (IST)  •  21 Jun 2024

AP Assembly Session Live:తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టిన పవన్ కల్యాణ్

AP Assembly Session Live: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి శాసనసభలో అడుగు పెట్టారు. పిఠాపురం నుంచి విజయం సాధించిన పవన్ కల్యాణ్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2008 నుంచి రాజకీయాల్లో ఉన్న 2014 పార్టీ పెట్టినా ఇంత వరకు ఆయన విజయం సాధించలేదు. 2019లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. 2024 పిఠాపురం నుంచి పోటీ చేసి దిగ్విజయం సాధించారు. ఎమ్మెల్యేగానే కాకుండా డిప్యూటీ సీఎంగా, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ, అటవీ, శాస్త్రసాంకేతిక శాఖ మంత్రిగా కూడా నియమితులయ్యారు.



09:59 AM (IST)  •  21 Jun 2024

నిజం గెలిచింది- ప్రజాస్వామ్యం నిలిచింది ప్లకార్డులు పట్టుకున్న టీడీపీ సభ్యులు

చంద్రబాబు శపథాన్ని గుర్తు చేసుకుంటున్న టీడీపీ సభ్యులు నిజం గలిచింది ప్రజాస్వామ్యం నిలిచిందని ప్లకార్డులు పెట్టుకొని నినాదాలు చేశారు. 

09:57 AM (IST)  •  21 Jun 2024

ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ శాసనభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణం చేయించారు. ముందుగా చంద్రబాబు ప్రమాణం చేశారు. 


 

09:47 AM (IST)  •  21 Jun 2024

AP Assembly Session Live: అసెంబ్లీ చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.





09:45 AM (IST)  •  21 Jun 2024

AP Assembly Session Live: చంద్రబాబు శపథం చేసినట్టుగానే సీఎంగా అసెంబ్లీలోకి చంద్రబాబు

2021 నవంబరు 19వ తేదీన అసెంబ్లీలో చంద్రబాబు శపథం చేసినట్టుగానే 2024లో ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో అడుగు పెట్టారు. 





09:31 AM (IST)  •  21 Jun 2024

AP Assembly Session Live: మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ప్రమాణం: పయ్యావుల కేశవ్

AP Assembly Session Live: సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సిన జగన్‌ను మంచి మనసుతో తాము మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణం చేయిస్తామన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. వైసీపీ అభ్యర్థన మేరకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారన్నారు. 

09:28 AM (IST)  •  21 Jun 2024

AP Assembly Session Live: వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అసెంబ్లీకి బయల్దేరిన సీఎం చంద్రబాబు

అమరావతిలోని వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి అసెంబ్లీకి సీఎం చంద్రబాబు బయల్దేరారు.