AP Assembly 2022 Live Updates: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు

నేటి (సెప్టెంబరు 20) ఏపీ అసెంబ్లీ లైవ్ అప్ డేట్స్ ఈ లైవ్ పేజీలో చూడవచ్చు. తాజా సమాచారం కోసం ఈ బ్లాగ్ ని రీఫ్రెష్ చేయండి.

ABP Desam Last Updated: 20 Sep 2022 12:36 PM

Background

పారిశ్రామికాభివృద్ధి, పరిశ్రమలపై అసెంబ్లీలో షార్ట్‌ డిస్కషన్ జరిగింది. దీనిపై ముగింపు ప్రసంగం చేసిన సీఎం జగన్ ఏపీలో జరుగుతున్న అభివృద్ధి వివరించారు. మూడేళ్లలో ఎలా మంచి జరిగిందో తెలిపారు. రాష్ట్రానికి వెయ్యి కోట్లతో బల్క్‌ డ్రగ్‌ పార్క్ ఇస్తామని కేంద్రం ముందుకొచ్చింది....More

TDP Leaders Suspension: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. మొత్తం 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. అంతకుముందు భూమన ప్రవేశపెట్టిన హౌస్ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికకు సంబంధిన రిపోర్ట్ బయట పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.