ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అక్టోబరు 21న డీఏ విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ 3.64 శాతం డీఏ విడుదల చేయనున్నారు. అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గెజిట్‌ను గవర్నర్‌ జారీ చేశారు.

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన భద్రత కల్పిస్తూ సీఎం జగన్ ప్రభుత్వం చట్టం చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్‌ చట్టానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సీపీఎస్‌ ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పించేలా జీపీఎస్ అమలు చేయనున్నారు. పదవి విరమణ సమయంలో మూల వేతనం లో 50 శాతం పెన్షన్ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది.


బోధనాసుపత్రుల్లో 99 ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 11 బోధనాసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా 99 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో, డీఎంఈ కార్యాలయ అవసరాలకు మంజూరై.. భర్తీ కాకుండా వివిధ కేటగిరిల్లో ఉన్న పోస్టులను రద్దు చేస్తూ, వాటి స్థానంలో కొత్త పోస్టులను సృష్టించింది. ప్రతి ఆసుపత్రికీ ఒక్కోటి చొప్పున ఎడ్మినిస్ట్రేటర్‌ పోస్టును ప్రభుత్వం కేటాయించింది. కొత్తగా మంజూరుచేసిన ఈ పోస్టును స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ (జాయింట్‌ డైరెక్టర్‌ అడ్మిన్‌), కేంద్ర ప్రభుత్వంలో అసిస్టెంట్‌ సెక్రటరీ కేటగిరిలో భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఇంజినీరింగ్‌), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ (సివిల్, ఎలక్ట్రికల్‌) ఫెసిల్టీ మేనేజర్, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టులను రెగ్యులర్‌ విధానంలోనే భర్తీ చేయనున్నారు.  ఈ పోస్టుల్లో డీఎంఈ కార్యాలయంలో అడిషనల్‌ డైరెక్టర్‌ పోస్టులు -02, నోడల్‌ ఆఫీసర్‌-08, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌-01, డేటా ఎనలిస్టు-02, ఎంఐఎస్‌ మేనేజర్‌-01, ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌ పోస్టులు-08 చొప్పున ప్రభుత్వం కేటాయించింది. అడిషనల్‌ డైరెక్టర్‌ పోస్టులను రెగ్యులర్, ఇతర పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు.


ALSO READ:


ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పార్ట్ టైమ్ కరస్పాండెంట్ ఉద్యోగాలు, వివరాలు ఇలా
విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ- రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్ట్ టైమ్ కరస్పాండెంట్(పీటీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. డిగ్రీతోపాటు న్యూస్‌ రిపోర్టింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 94406 74057 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


కాకినాడ సహకార బ్యాంకులో 33 ఆఫీసర్, క్లర్క్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కాకినాడలోని కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ పలు శాఖల్లో ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..