Ammavodi Rules :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకంలో ఈ సారి లబ్దిదాలు సంఖ్యను తగ్గించారు. అర్హులు తగ్గిపోయారని ప్రభుత్వం చెబుతోంది.  అర్హతా నిబంధనలు సాధించలేకపోవడంతో అమ్మఒడి పథకం మూడో విడత సాయంలో 1.29 లక్షల మంది తల్లులకు ప్రభుత్వం కోత పెట్టాలని నిర్ణయించింది.  కోవిడ్‌ కారంణంగా పాఠశాలలకు గైర్హాజరు కావటంతో 51 వేల మందికి అమ్మఒడి పథకానికి అనర్హులుగా ప్రభుత్వం తేల్చింది. మిగతా 50 వేల మంది పైచిలుకు విద్యార్ధులకు వేర్వేరు కారణాలతో పథకం నిలిపివేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అర్హుల జాబితాను పంపించిన ప్రభుత్వం.. అనర్హుల జాబితాను మాత్రం ఇవ్వలేదు. లబ్దిదారుల జాబితాలో ఉన్న వారు తప్ప మిగతా వారంతా అనర్హులేనని ప్రభుత్వం ప్రకటించింది. 


అమ్మఒడికి పన్నెండు షరతులు !


అమ్మఒడి పథకం పొందాలంటే మొత్తం పన్నెండు రకాల షరతులు పూర్తి చేసి ఉండాలి.  75 శాతం హాజరు , కొత్త బియ్యం కార్డు , కరెంట్ బిల్లు 300 యూనిట్లు కన్నా తక్కువ వాడి ఉండాలి, తల్లి, విద్యార్తి ఒకే ఇంట్లో ఉండాలి, విద్యార్థి ఈకేవైసీ, వాలంటీర్ దగ్గర వివరాలు చెకింగ్, బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులుంచుకోవడం , బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లిం్ చేసుకోవడం.. ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ తో లింక్ చేసుకోవడం వంటివన్నీ చేయాలి. బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ లో ఉండాలని..ఒక వ్యక్తికి రెండు కన్నా ఎక్కువ అ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లయితే ఎన్‌పీసీఐ చేయించుకోవాలని చేపించుకోవాలి.  గవర్నమెంట్ ఉద్యోగి, ఇన్కమ్ టాక్స్ కట్టే వారికి జగనన్న అమ్మ ఒడి వర్తించదు .  


ఈ ఏడాది రూ. 13 వేలు మాత్రమే !


ఈ నిబంధనల్లో ఏ ఒక్కటి లేకపోయినా అమ్మఒడి రాదు. ఒకవేళ తప్పుడు వివరాలు ఇచ్చి ఉంటే క్రిమినల్ కేసులు పెడతారు. కొత్త జిల్లాల వారీగా ఆధార్ కార్డు మార్చుకోవాల్సి ఉందన్న  షరతు కూడా పెట్టారు. ఇన్ని షరతులు పూర్తి చేసిన వారికే అమ్మఒడి వస్తుంది. ఈ అర్హతలు ఉన్న వారందరికీ అమ్మఒడి ఇస్తున్నామని ద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.  ఈనెల 27న అమ్మఒడి పథకం నిధుల ప్రభుత్వం విడుదల చేయనుంది. ప్రతి సంవత్సరం రూ.15 వేలు తల్లుల ఖాతాలో వేసే ప్రభుత్వం ఈ ఏడాది రూ. 13 వేలను ప్రభుత్వం జమ చేయనుంది. నిర్వహణ పేరుతో రూ.2వేల కోత పెట్టింది. .


అర్హులు అందరికీ ఇస్తున్నామన్న ప్రభుత్వం 


అమ్మఒడి పథకం గత ఏడాది జనవరిలో ఇచ్చారు. మళ్లీ ఈ ఏడాది జనవరిలో ఇవ్వాల్సి ఉంది. కానీ జూన్‌కు వాయిదా వేశారు. ఈ క్రమంలో ఈ సారి పెద్ద ఎత్తున లబ్దిదారులకు కోత పడుతూండటంతో పలువురిలో ఆందోళన నెలకొంది. తమకు నిధులు వస్తాయా రావా అని ఎక్కువగా వాకబు చేస్తున్నారు. లబ్దిదారుల జాబితాలో పేర్లు లేని వారు సచివాలయాలు, వాలంటీర్లను నిలదీస్తున్నారు.