Ysrcp Mlc Candidates : ఎమ్మెల్సీ స్థానాల్లో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశామని వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. 18 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ స్థానిక కోటాలో 9 మంది, ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో మరో ఇద్దరి పేర్లను ప్రకటించారు. ఇందులో బీసీలకు 11, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, ఓసీలకు 4 స్థానాలకు కేటాయించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానం కల్పించారని చెప్పారు.
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు
1. నర్తు రామారావు (బీసీ- యాదవ), శ్రీకాకుళం జిల్లా
2. కుడిపూడి సూర్యనారాయణ (బీసీ -శెట్టి బలిజ), తూ.గో జిల్లా:
3. వంకా రవీంద్రనాథ్ (ఓసీ - కాపు), ప.గో జిల్లా
4. కవురు శ్రీనివాస్ (బీసీ - శెట్టి బలిజ), ప.గో జిల్లా
5. మేరుగ మురళీ (ఎస్సీ - మాల), నెల్లూరు జిల్లా
6. డా.సిపాయి సుబ్రహ్మణ్యం (వన్య కుల క్షత్రియ), చిత్తూరు జిల్లా
7. రామసుబ్బారెడ్డి (ఓసీ - రెడ్డి), కడప జిల్లా
8. డాక్టర్ మధుసూదన్ (బీసీ - బోయ), కర్నూలు జిల్లా
9. ఎస్. మంగమ్మ (బీసీ - బోయ), అనంతపురం జిల్లా
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు
1. పెనుమత్స సూర్యనారాయణ(క్షత్రియ సామాజిక వర్గం), విజయనగరం జిల్లా
2. పోతుల సునీత (బీసీ - పద్మశాలి), ప్రకాశం జిల్లా
3. కోలా గురువులు (ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్), విశాఖ జిల్లా
4. బొమ్మి ఇజ్రాయిల్ (ఎస్సీ - మాదిగ), తూర్పు గోదావరి జిల్లా
5. జయమంగళ వెంకటరమణ, (వడ్డీల సామాజిక వర్గం), ఏలూరు జిల్లా
6. చాందగిరి ఏసు రత్నం వడ్డెర (బీసీ), గుంటూరు జిల్లా
7. మర్రి రాజశేఖర్ (ఓసీ -కమ్మ), పల్నాడు జిల్లా
* గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు*
1. కుంభా రవి బాబు (ఎరుకుల - ఎస్టీ), అల్లూరి సీతారామరాజు జిల్లా
2. కర్రి పద్మ శ్రీ (బీసీ - వాడ బలిజ), కాకినాడ సిటీ
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట-సజ్జల
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్‌బోన్ క్లాస్ అని జగన్మోహన్ రెడ్డి నిరూపించారని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చామన్నారు సజ్దల. ఓట్ల కోసం నినాదాలు ఇచ్చే పార్టీ తమది కాదని...వారిని అధికారంలో భాగస్వామ్యులను చేశామని చెప్పారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ చేశారు. టీడీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మండలిలో 37 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తే.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం బీసీలకే 43 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామన సజ్జల స్పష్టం చేశారు. మండలిలో బీస్సీ, ఎస్సీ, ఎస్టీలకు 68 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామన్నారు. సామజిక సాధికారిత అంటే తమదేనన్నారు. చంద్రబాబు మాటలు చెబితే మేము చేతల్లో చూపించాము అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.