Sajjala On New Cabinet : ఏపీ కేబినెట్ కూర్పుపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. మంత్రుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాత 24 మంది మంత్రులను రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. కొత్త మంత్రుల జాబితాను జీఏడీ అధికారులు సీల్డ్ కవర్ లో గవర్నర్ కార్యాలయానికి అందించనున్నారు. రాత్రి 7 గంటల తర్వాత కొత్త మంత్రుల జాబితా ప్రకటన ఉండొచ్చని సమాచారం. ఇప్పటి పలువురి పేర్లు బయటకు రావడంతో ఆ నేతల ఇళ్ల వద్ద సందడి వాతావరణ నెలకొంది.
సీఎం జగన్ స్వయంగా ఫోన్
మంత్రి వర్గ జాబితాలో సీఎం జగన్ పలు మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. గత మూడు రోజులుగా కేబినెట్ కూర్పుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం జగన పలుమార్పు చర్చించారు. ఆదివారం కూడా సజ్జల ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. సీఎం జగన్ తో సమావేశం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. కేబినెట్ కూర్పుపై కసరత్తు పూర్తయిందని ఆయన చెప్పారు. సామాజిక సమీకరణాలతో నూతన కేబినెట్ కూర్పు ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతాల మేరకు కొత్త మంత్రి వర్గం ఉంటుందని ఆయన చెప్పారు. సీఎం జగన్ ఖరారు చేసిన కొత్త మంత్రుల జాబితాను రాత్రి 7 గంటల తర్వాత గవర్నర్ బిశ్వభూషణ్‌కు పంపనున్నట్లు సజ్జల ప్రకటించారు. కొత్త మంత్రుల జాబితాను సీల్డ్ కవర్‌లో గవర్నర్ కు అందిస్తామన్నారు. తుది జాబితాలోని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ స్వయంగా ఫోన్ చేసి సమాచారం ఇవ్వనున్నట్లు సజ్జల పేర్కొ్న్నారు. సీఎం జగన్ తొలిసారి కేబినెట్ కూర్పులో 56 శాతం బలహీనవర్గాల వారికి ఛాన్స్ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సారి కూడా బలహీనవర్గాల శాతం మరింత పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
అసంతృప్తులతో సజ్జల భేటీ
అయితే మంత్రి పదవుల దక్కని వారితో మాట్లాడాలని సజ్జలకు సీఎం జగన్ మార్గనిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వెళ్లిన సజ్జల ఆయనతో చర్చించనట్లు తెలుస్తోంది. అయినా బాలినేని సంతృప్తి చెందనట్లు సమాచారం. మాచర్ల పిన్నెల్లి వర్గం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. రాజీనామాలు సిద్ధమని చెబుతోంది. అసంతృప్తులను కూల్ చేసేందుకు సజ్జల ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఆయన బాలినేని ఇంటికి వచ్చి వెళ్లారు.
Also Read : AP New Cabinet: ఏపీ నూతన కేబినెట్‌పై ఉత్కంఠ! జిల్లాలవారీగా కొత్త మంత్రుల ఫైనల్ లిస్టు ఇదే?