Janasena Manifesto : జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. షణ్ముక వ్యూహంతో ముందుకు వెళ్లామని చెప్పిన ఆయన జనసేన(Janasena) యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ను జనసేన సౌభాగ్య పథం పేరుతో సమూలంగా మార్చేస్తామన్నారు పవన్. దామోదరం సంజీవయ్య కర్నూలు(Kurnool) జిల్లాగా పేరు మారుస్తామన్నారు. "బలమైన పారిశ్రామిక పాలసీ తీసుకొస్తాం. వైట్‌ రేషన్‌ కార్డుదారులకు, అల్పాదాయ వర్గాల వారికి ఇసుకను ఉచితంగా ఇస్తాం. అదనపు గదులు నిర్మించుకున్నా ఉచితంగానే ఇస్తాం. మీ ప్రతిభకు తగ్గట్టు రాణించేందుకు పది మందికి ఉపాధి కల్పిస్తామని చెబితే పది లక్షలు అకౌంట్లలో వేస్తాం. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యం. ప్రభుత్వంలో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తాం. సీపీఎస్‌ రద్దు చేస్తామన్నారు" పవన్. ప్రతి ఏటా ఐదు లక్షల ప్రైవేటు ఉద్యోగాలు వచ్చేలా పాలన ఉంటుందన్నారు. విశాఖను విశ్వనగరంగా మారుస్తామన్నారు.  


జనసేన మేనిఫెస్టో 


ఆంధ్రప్రదేశ్ లో సుపరిపాలన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. 2024లో జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జనసేన అప్రకటిత మేనిఫెస్టోను పవన్ ప్రకటించారు. షణ్ముక వ్యూహంతో ముందుకెళ్తామని పవన్ అన్నారు. జనసేన ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు ఇవి అని కొన్నింటిని పవన్ ప్రస్తావించారు. అప్పుల్లేని ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తాన్నారు. ఫ్రెండీ ఇన్వెస్టిమెంట్ సిస్టమ్ ను అమలు చేస్తామన్నారు. విశ్వనగరంగా విశాఖను, హైటెక్ సిటీలుగా విజయవాడ, తిరుపతి అభివృద్ధి చేస్తామని పవన్ అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు. 


కర్నూలు జిల్లా పేరు మార్పు 


రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా మారుస్తామన్నారు. తెల్లరేషన్ కార్డులు ఉన్నవారికి వారికి ఉచితంగా ఇసుక అందిస్తామన్నారు. యువతకు సులభ్ కాంప్లెక్స్ ఉద్యోగాలు కాకుండా స్వయం ఉపాధి ఏర్పాట్లు చేస్తామని పవన్ అన్నారు. వ్యవసాయరంగాన్ని లాభసాటిగా చేయడం కోసం మార్కెటింగ్ సౌకర్యాలు, ఫుడ్ పార్కుల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మన ఏపీ మన ఉద్యోగాలు అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. జనసేన అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఏడాదికి 5లక్షల ఉద్యోగాలు ఇచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తామని పవన్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. సీపీఎస్ పై అధ్యయనం చేసిన తర్వాతే హామీ ఇస్తున్నామని పవన్ అన్నారు.