Perni Nani On Pawan : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు. యువశక్తి సభతో యువతలో స్ఫూర్తి నింపుతానన్న పవన్‌ సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నారని విమర్శించారు. పవన్ దిగజారుడు స్వభావం మరోసారి స్పష్టం అయిందన్నారు. సినిమా డైలాగ్స్ తోనే ప్రసంగం ముగిసిందన్నారు. మైకు దొరికిందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. సభకు వచ్చిన వాళ్లను నమ్మనని చెప్పడమే దౌర్భాగ్యమన్నారు. తనను అభిమానించే వాళ్లను కూడా పవన్ కించపరిచారన్నారు. నమ్మి వచ్చిన వారితో మాట్లాడే భాషేనా ఇదేనా అంటూ మండిపడ్డారు.  పవన్‌ కల్యాణ్‌ మూడు ముక్కల రాజకీయ నేత అంటూ ఎద్దేవా చేశారు.  ముందు టీడీపీ, తర్వాత బీఎస్సీ, బీజేపీ, ఇప్పుడు మళ్లీ టీడీపీతో అంటకాగుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో పవన్‌ ఒక్కరే బరితెగింపు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. 


నియంత ప్రభుత్వం అయితే మీటింగ్ జరిగేదా? 


చంద్రబాబుకు, పవన్ కలిసి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని పేర్ని నాని ఆరోపిచారు. కాపులను, బీసీలను మోసం చేశారన్నారు. స్టేజ్‌ మీద బీసీలను ఎందుకు కూర్చోబెట్టలేదని పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మాటలు బిల్డప్‌ బాబాయ్‌ మాటలన్నారు.  వైసీపీది నియంత ప్రభుత్వం అయితే జనసేన మీటింగ్‌కు పర్మిషన్‌ వస్తుందా? అన్నారు. బాలకృష్ణ సినిమాకు టికెట్‌ రేట్‌ పెంచుకునేందుకు పర్మిషన్‌ వస్తుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబుతో భేటీలో  దేశం గురించి కాకుండా అంబటి, అమర్నాథ్‌ గురించి మాట్లాడుకున్నారా? అని ప్రశ్నించారు. ఎట్టకేలకు చంద్రబాబుతో పవన్ కు ఉన్న సంబంధాన్ని బయటపెట్టారన్నారు. ఈ విషయం వైఎస్‌ జగన్‌ చెబితే ఎందుకు భుజాలు తడుముకున్నారన్నారు.  


మా దగ్గరా చెప్పులున్నాయ్ 


పవన్ నోరు జారితే తమ దగ్గర కూడా చెప్పులున్నాయని గుర్తించుకోవాలని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి పంచెకున్న దారం కూడా పవన్ ముట్టుకున్నాడా?  అని ప్రశ్నించారు. సొల్లు కబుర్లు చెప్పడం పవన్ మానుకోవాలని సూచించారు. యువశక్తి  పేరుతో  యువతకు పవన్ స్ఫూర్తి నింపుతా అని చెప్పి సెల్ఫ్  డబ్బా కొట్టుకున్నారని విమర్శించారు. పవన్ కు సినిమా భాష మాత్రమే తెలుసన్నారు. ఆయనది దిగజారిన వ్యక్తిత్వం అని, ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా  మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వాళ్లతో నేను మిమ్మల్ని నమ్మను అంటున్నారని, నిన్ను నమ్మి వచ్చిన మనుషులతో ఇలా మాట్లాడతారా? పేర్ని నాని ప్రశ్నించారు. మూడు ముక్కల ముఖ్యమంత్రా? మరి పవన్ ఏంటి  ముందు టీడీపీ మొదటి  ముక్క, తర్వాత  బీఎస్పీ  బీజేపీ  రెండో  ముక్క. ఇప్పుడు  టీడీపీ  మూడో  ముక్క అని విమర్శించారు. బీజేపీతో ఉంటూ చంద్రబాబుకు కన్ను కొడుతున్నారని మండిపడ్డారు. ఇది రాజకీయ వ్యభిచారం కాదా? అని నిలదీశారు. చంద్రబాబు, పవన్ కలిసి అంబటి రాంబాబు, ఐటీ మంత్రి అమర్నాథ్ గురించి మాట్లాడుకున్నారా? మీ బతుకులు ఇవి అని విమర్శించారు. చంద్రబాబుకు తనకు మధ్య ఉన్నది ఎదురింటి సంబంధం లాంటిదని పవన్  చెప్పారన్నారు. మరి  దత్తపుత్రుడు అంటే ఎందుకు ఉలికిపాటని ప్రశ్నించారు.