Daggubati Purandeswari : వికేంద్రీకరణ సాధ్యం కాదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రోడ్లు వేయలేని వారు, పరిశ్రమలు ఏర్పాటు చేయలేని వాళ్లు వికేంద్రీకరణను ఎలా సాధిస్తారని ఆమె ప్రశ్నించారు. బీజేపీని ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆమె చెప్పారు. అమరావతి రాజధానిగా ఉంటుందనే కేంద్రం భారీ ఎత్తున ఏపీకి నిధులు ఇచ్చిందని పురంధేశ్వరి చెబుతున్నారు.


కన్నా ఫైర్ 


చేతకాని దద్దమ్మలా వైసీపీ పరిపాలన పరిపాలన ఉందని బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. అభివృద్ధి చెందిన విశాఖను దోచుకుంటూ వికేంద్రీకరణ అంటూ మాట్లాడటం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. మాట తప్పం మడం తిప్పమని, ఇప్పుడు అన్నింటిలో వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం పై కన్నా విమర్శలు చేశారు.  


బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశాలు


ఆంధ్రప్రదేశ్‌లో ఎలా బలపడాలనే అంశంపై భారతీయ జనతా పార్టీ విస్తృత కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన ప్రజాపోరు కార్యక్రమం విజయవంతం కావడం, ప్రజా స్పందన,  గుర్తించిన సమస్యలు - వాటి పరిష్కారాలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణను చర్చించేందుకు రెండు రోజుల పాటు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశాలు విజయవాడలో జరుగుతున్నాయి. సోము వీర్రాజు ఆధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాలకు  ముఖ్యఅతిధులుగా భాజపా జాతీయ నాయకులు, రాష్ట్ర ఇన్‌ఛార్జి, కేంద్రమంత్రి మురళీధరన్‌, సహ ఇన్‌ఛార్జి   సునిల్‌ దేవధర్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి పురంద్వేరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, జాతీయ స్థాయి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 


పార్టీ బలోపేతం లక్ష్యంగా సమావేశాలు


వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేకవిధానాలపై ఉద్యమాలు, పోరాటాల రూపకల్పన, పార్టీ బలోపేతం లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాల రెండో రోజు ఆదివారం జ  భాజపా జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌ఛార్జులు, ప్రజాపోరు వీధి సమావేశాల అసెంబ్లీ కన్వీనర్లు, కో కన్వీనర్లతో విస్తృత స్ధాయి సమావేశం జరుగుతుంది . 2024 ఎన్నికలే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రాబోయే రోజుల్లో చేపట్టనున్న ప్రజా ఉద్యమాలపై సమావేశం కీలక నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి చెబుతున్నారు.