Airbus shortlists four states for copter unit:  విమానాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎయిర్ బస్ మన దేశంలో హెలికాఫ్టర్ల తయారీ ప్లాంట్ ను పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో  నాలుగు ప్రదేశాలను షార్ట్‌లిస్ట్ చేసినట్లుగా పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. టాటా అడ్వాన్సెడ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL)తో భాగస్వామ్యంతో H125 హెలికాప్టర్ల ఉత్పత్తి ప్లాంట్ ను ఏర్పాటుచేయనుంది. ఇప్పటి వరకూ ఇలాంటి హెలికాఫ్టర్ల తయారీ పరిశ్రమలను మూడు వివిధ దేశాలలో ఏర్పాటు చేసింది. నాలుగోది ఇండియాలో ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది.  మేక్-ఇన్-ఇండియా లో భాగంగా టాటాలతో కలిసి ఈ ప్లాంట్ నిర్మింంచనున్నారు.   

టాటాలతో కలిసి హెలికాఫ్టర్ల ప్లాంట్ పెట్టాలనుకుంటున్న ఎయిర్ బస్ 

ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ , కర్ణాటకలలో స్థల పరిశీలన చేశారు.  సింగిల్-ఇంజన్ హెలికాప్టర్‌ను ఎక్కడ అసెంబుల్ చేస్తారనే దానిపై త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలోనే నుండి   H125ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఉద్యోగులకు, రవాణాకు మెరుగైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోనున్నారు. భారతదేశంలో  ప్రైవేట్ రంగంలో సివిల్ హెలికాప్టర్  తయారీ ప్లాంట్ ఇదే అవతుుందని ఇండస్ట్రీర వర్గాలు చెబుతున్నాయి. ప్రారంభంలో సంవత్సరానికి 10 H125లను ఉత్పత్తి చేస్తారు. ఆర్డర్లు పెరిగేకొద్దీ ఉత్పత్తి పెరుగుతుంది. రాబోయే 20 సంవత్సరాలలో దేశంతో పాటు  దక్షిణాసియాలో H125 తరగతికి చెందిన హెలికాప్టర్లకు డిమాండ్ ఉంటుందని ఎయిర్‌బస్ హె అంచనా వేస్తోంది. 

వచ్చే ఏడాదిలోనే తొలి హెలికాఫ్టర్ ఉత్పత్తి చేయాలని టార్గెట్  

2024 జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అప్పటి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య జరిగిన చర్చల సందర్భంగా ఇండియాలో ప్లాంట్ విషయంపై చర్చింంచచారు. 2.8 టన్నుల బరువున్న H125 ఆరుగురు ప్రయాణికులను తీసుకెళ్లగలదు, గరిష్టంగా 23,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది, 630 కి.మీ. పరిధిని మరియు 250 కి.మీ. గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. వాణిజ్య రవాణా, చట్ట అమలు, అత్యవసర వైద్య సేవలు, విపత్తు నిర్వహణ, ఆఫ్‌షోర్ పరిశ్రమ,  అగ్నిమాపక చర్య వంటి పాత్రలకు ఇది సరిపోతుంది. అందుకే డిమాండ్ కు లోటు ఉండదని భావిస్తున్నారు.  

ఏపీకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం   

రాయలసీమలో తయారీ రంగానికి అనువైన వాతావరణం ఉందని ఏపీ ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. కియా పరిశ్రమ ఎంత వేగంగా పూర్తయిందో.. ఉత్పత్తి ప్రారంభమయిందో ఓ కేస్ స్టడీగా చూపిస్తున్నారు. విద్యుత్, నీరు , భూమి వంటి మౌలిక సదుపాయాలతో పాటు  ట్రాన్స్ పోర్టుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏపీకి ఉన్నాయని చెబుతున్నారు. ఈ ప్లాంట్ కోసం పోటీ పడుతున్న మిగతా మూడు రాష్ట్రాలు పారిశ్రామిక పరంగా అభివృద్ది చెందినవే.    ఏపీ కొత్త రాష్ట్రం కావడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ప్రోత్సాహకాలు భారీగా ఇస్తోంది. ఈ క్రమంలో అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు ఎయిర్ బస్ సంస్థ కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.  

Also Read: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?