Yuvagalam Victory Rally : యువగళం విజయోత్సవ ర్యాలీని టెక్కలిలో అచ్చెన్నాయుడు,  రామ్మోహన్ నాయుడు  భారీగా నిర్వహించారు.  టెక్కలి నవ శకానికి నాంది పలకాలని..ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలన్న పిలుపుతో సాగిన ర్యాలీలోఅచ్చెన్నతోపాటు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు ముందు కదలగా.. వెనుకగా వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సాగారు. 10వేల ద్విచక్ర వాహనాలతో ర్యాలీ సాగింది. కోటబొమ్మాళిలో బయల్దేరి కొత్తమ్మ తల్లి  అమ్మవారిని దర్శించుకుని బయల్దేరారు. ఈ ర్యాలీ విజయవంతం కావడంతో మరోసారి అచ్చెన్న తన అడ్డాలో బల నిరూపణ చేసుకున్నారు. 


కళ్లు తిరిగిపోయే ర్యాలీ నిర్వహించిన బాబాయ్ , అబ్బాయిలు


ఆరు కిలోమీటర్ల పొడవు ఉన్న వాహన శ్రేణితో  అచ్చెన్న, రామ్మోహన్ లు శ్రేణులను ఉత్తేజపరుస్తూ ముందుకు సాగారు. దీంతో కార్యకర్తలు, అభిమానుల్లో మరింత జోష్ పెరిగింది.  సుమారుగా 6 కిలోమీటర్ల మేర పసుపు మయమైంది. ఈ సందర్భంగా  అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్ పని అయిపోయిందని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ,జన సేనలతో ప్రభుత్వం ఏర్పడనుందని స్పష్టం చేశారు. నమ్మించి వంచించడం జగన్న్కెజమని, అతని సొంత ప్రయోజనం కోసం ఎవరిన్కెనా బలి చేస్తాడని మండిపడ్డారు.  సొంత  తల్లికి, చెల్లికీ ద్రోహం చేశాడన్నారు. నమ్మిన ఎమ్మెల్యేలను.. నమ్మి ఓట్లేసిన ప్రజలను,ఉద్యోగులను.. చివరికి సొంత వాలంటీర్లకు సైతం ద్రోహం చేశాడని ఆరోపించారు. రాబోయేఎన్నికలు వైసీపీకి, రాష్ట్రంలో ఉన్న అయిదు కోట్ల మంది ప్రజలకు మధ్య జరుగుతున్నాయనిటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రానికి ఉన్న పేరు, ప్రతిష్టలను జగన్ నాశనం చేశారని విమర్శించారు. 


సైకో జగన్ పనైపోయింది ! 


సైకో జగన్ పనైపోయిందని  అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. ఎన్నికలెప్పుడొచ్చినా తెలుగుదేశం - జనసేన ప్రభుత్వఏర్పాటు ఖాయమన్నారు.  యువగళం-నవశకం సభ ద్వారా ప్రజా చైతన్యంవెల్లువిరిసిందన్నారు. అధికారం మార్పు ఎప్పుడెప్పుడా అని ప్రజలు కసిగా ఎదురుచూస్తున్నారని ఉద్ఘాటించారు. నారా లోకేశ్ యువగళం నవశకం సభ జరగకుండాచేయాలని సీఎం జగన్ అనేక ఇబ్బందులు పెట్టాడని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాది  మంది ప్రజలు తరలి వచ్చి సభను విజయవంతం చేశారని అన్నారు. ఎన్నికలకు ఇంకా వందరోజుల సమయం మాత్రమే ఉందని, కాబట్టి కార్యకర్తలు, నాయకులు ప్రతి నిమిషంఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి నిమిషం కష్టపడి పనిచేసి రాష్ట్రంలో తెలుగుదేశంజనసేన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావాలని పిలుపునిచ్చారు.  


వంద రోజులు శ్రమిస్తే టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు !   


ఇదే ఉత్సాహంతో మరో 100 రోజులు కొనసాగిస్తే.. టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని చూస్తాం. 100 రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని వదిలించు కొని సైకోను తరిమితరిమి కొట్టబోతు న్నాం. 100రోజుల్లో దళితులు.. ఆడబిడ్డల పై జరుగుతున్న అన్యాయాలు.. అఘా యిత్యాలను కట్టడి చేయబోతున్నామని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.  100 రోజుల్లో యువతకు మంచి ఉపాధి అవ కాశాలు కల్పించబోతున్నామన్నారు. . 100 రోజు ల్లో రైతుల ముఖాల్లో ఆనందం నింపి, వారిని రారాజుల్ని చేయబోతున్నాం. 100 రోజుల్లో బడుగుబలహీన వర్గాల్ని పైకి తీసుకురాబోతున్నాం. 100 రోజుల్లో పోల వరం పూర్తిచేయడానికి శంఖారావం ఊద బోతున్నాం.. 100 రోజుల్లో మన రాష్ట్ర రాజధాని ఇదని గర్వంగా చెప్పుకోబోతు న్నామని తెలిపారు.   క్రమ శిక్షణతో, కలిసికట్టుగా ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలు సాధించాలని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. ఎవరికైనా ఏమై నా ఇబ్బంది కలిగినా.. తప్పు జరిగిందని అనిపించినా పెద్దమనస్సుతో పెద్దమనుషుల్లా క్షమించి, ఇది మన కార్యక్రమం అనుకొని సర్దుకుపోవాలని కోరారు.