Salaar Box Office collection Day 4: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాలార్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ సినిమాకు పోటీగా మరే సినిమా లేకపోవడంతో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. షారుఖ్ ఖాన్ ‘డంకీ’ చిత్రం ‘సలార్’పై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉందని అందరూ భావించినా, చివరకు ఏ విషయంలోనూ ఆ మూవీ అడ్డంకిగా మారలేదు. ‘సలార్’ వసూళ్లను ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. క్రిస్మస్ రోజున కూడా ‘సలార్’ వసూళ్ల పరంగా సత్తా చాటింది. న్యూ ఇయర్ కూడా ఈ సినిమాకు మరింత బూస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు పలువురు ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నాలుగు రోజుల్లో రూ. 400 కోట్లు దాటిన వసూళ్లు
ఇండస్ట్రీ ట్రాకర్ Sacnilk నివేదికల ప్రకారం, ‘సలార్’ విడుదలైన నాలుగు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ. 254.87 కోట్ల నెట్ వసూలు చేసింది. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం రూ. 45.77 కోట్ల నెట్ అందుకుంది. ఈ మూవీ విడుదలైన రోజున, ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా రూ. రూ.90.7 కోట్ల నెట్ వసూలు చేసింది. తొలి వీకెండ్ లో రూ. ₹118.4 కోట్ల నెట్‌ని వసూలు చేసింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో చిత్ర నిర్మాతలు చేసిన పోస్ట్ ప్రకారం, ఈ చిత్రం విడుదలైన 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.402 కోట్లు వసూలు చేసింది.
రూ. 165 కోట్లకు అమ్ముడైన తెలుగు థియేట్రికల్ రైట్స్
బ్లాక్ బస్టర్ ‘KGF’ సిరీస్ తో దేశ వ్యాప్తంగా సత్తా చాటిన ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’ మూవీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పించింది. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ‘సలార్’ తొలి రోజు రూ. 178.7 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ హైగా నిలిచింది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులారిటీ ఉంది. ఈ నేపథ్యంలో ‘సలార్’ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో భారీ ప్రీ రిలీజ్ నెంబర్స్ సాధించింది. ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.165 కోట్లకు అమ్ముడయ్యాయి. దిగ్గజ దర్శకుడు SS రాజమౌళి చిత్రం 'RRR' తర్వాత అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో చిత్రంగా ‘సలార్’ నిలిచింది. అంతేకాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రూ. 150 కోట్లకు పైగా అమ్ముడయిన మూడవ చిత్రంగా నిలిచింది. ‘బాహుబలి 2’, ‘RRR’ తర్వాత ‘సలార్’ ఆ ఘనత సాధించింది. ఇప్పటికే రూ.200 కోట్ల బ్రేక్ ఈవెన్‌ను అధిగమించి బాక్సాఫీస్ హిట్‌గా నిలవడంతో ‘సలార్’ నిర్మాతలకు లాభాల పంట పండుతోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించబడిన ‘సలార్’ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు.
Read Also: 'సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ఇండియన్ ఫిల్మ్ రేంజ్ పెరుగుతోంది' ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్