Jogi Ramesh name in liquor scam:  ఆంధ్రప్రదేశ్ లో బయటపడిన నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ 1 నిందితుడుగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు.. వైసీపీ నేత జోగి రమేష్ చేసిన కుట్ర వల్లనే ఇదంతా జరిగిందని బయట పెట్టారు. జోగి రమేష్ ఇచ్చిన  మూడు కోట్ల రూపాయల ఆఫర్ కు ఆశపడే ఇదంతా చేశానని జనార్దన్ రావు చెబుతున్నారు.   వైసీపీ హయాంలోనే పెద్ద ఎత్తున నకిలీ మద్యం వ్యాపారం చేశామని జనార్దన్ రావు తెలిపారు.  పోలీసులు పట్టుకుంటే బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత నిఘా ఎక్కువ కావడంతో నకిలీ మద్యం తయారీ ఆపేశామన్నారు. ఏప్రిల్‌లో ఇ జోగి రమేష్ మద్యం తయారీ ప్రారంభించాలని సూచించారని పోలీసులకు చెప్పారు. ఒక వేళ దొరికతే.. ప్రభుత్వంపై బురద చల్లవచ్చని.. తంబళ్లపల్లె  నుంచే ప్రారంభించాలని సూచించారన్నారు. దొరికితే అన్ని  విధాలుగా అండగా ఉంటానని  చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. అద్దెపల్లి నర్సింగరావు  స్టేట్ మెంట్ సంచలనం సృష్టిస్తోంది.  

Continues below advertisement

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేస్తానని జోగి రమేష్ చెప్పారని.. జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందన్నారు.  పైవారి ఆదేశాలతోనే నీకు ఈ పని అప్పగిస్తున్నా అని జోగి రమేష్ నాతో చెప్పారని జనార్దన్ రావు చెప్పారు.   జనార్దన్ రావు వీడియో సంచలనం సృష్టిస్తోంది.  వైపీసీ నేతలు.. నకిలీ మద్యం కేసును సీబీఐకి ఇవ్వాలని ఆందోళనలు చేశారు. అదే రోజు అసలు విషయం వెలుగులోకి  వచ్చినట్లయింది. 

Continues below advertisement

మరో వైపు ప్రభుత్వం నకిలీమద్యం కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు.  ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో మల్లికా గార్గ్, రాహుల్ దేవ్ శర్మ  వంటి సీనియర్ ఆఫీసర్లతో ఈ సిట్  ను నియమించారు. నకిలీ మద్యం సూత్రధారుల్ని గుర్తించి శరవేగంగా నిందితుల్ని పట్టుకోవాలని ఆదేశించారు. 

మరో వైపు ఏపీ ప్రభుత్వం సురక్ష యాప్ తీసుకు వచ్చింది. మద్యం దుకాణాల్లో అమ్మే ప్రతి  బాటిల్ పైా.. క్యూఆర్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే మద్యం ఉత్పత్తి కంపెనీ..సహా మొత్తం సమాచారం వచ్చేలా ఏర్పాటు చేశారు. నకిలీ మద్యం  ఎక్కడా అమ్మకుండా చూసేందుకు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా నకిలీ మద్యం కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేసేలా అవకాశం కల్పించారు.