Young Woman Suicide Attempt In Konaseema District: వారిరువురూ ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. అయితే, వారి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి అంగీకరించలేదు. యువతి తాళి తెంచేసి ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దీంతో సదరు యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో (Konaseema District) చోటు చేసుకుంది. బాధిత యువతి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో గండ్రోతు హరికృష్ణ, అదే గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు కావడంతో గత నెల 10వ తేదీన పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు.


విషయం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు వేరు కావడంతో యువతి మెడలో తాళి తెంచేసి ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దీంతో ఏం చేయాలో తెలియక యువతి ఆత్మహత్యకు యత్నించింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. హరికృష్ణపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. అనంతరం అతను బెయిల్‌పై బయటకు రాగా.. తనకు న్యాయం చేయాలంటూ యువకుడి ఇంటి ముందు యువతి నిరాహార దీక్షకు దిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తనను ఆదుకోవాలని వేడుకుంటోంది.


Also Read: Kakinada Port Ship Seized: రేషన్ బియ్యం అన్‌లోడ్ చేశాకే, షిప్ రిలీజ్ చేయడంపై నిర్ణయం- కాకినాడ కలెక్టర్