Volunteer attack in Madanapally :  ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల పై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేసిన తర్వాత .. ఎక్కడైనా వాలంటీర్లు నేరాలకు పాల్పడితే పెద్ద ఇష్యూ అవుతోంది. ప్రతి యాభై ఇళ్లకూ  ఓ వాలంటీర్ ఉండటంతో ప్రతీ రోజూ ఎక్కడో ఓ చోట వాలంటీర్లు వివాదాస్పద పనులకు పాల్పుడుతూనే ఉన్నారు. మీడియాలో హైలెట్ అవుతూనే ఉన్నారు. తాజాగా మదనపల్లిలో ఓ వాలంటీర్ నిర్వాకం వైరల్ అవుతోంది. ఓ మహిళపై దాడి చేసిన వాలంటీర్ ఆమెను తీవ్రంగా గాయపరిచాడు.ఇతర మహిళలు వారిస్తున్న వినకుండా దాడి చేశాడు.                                               

  


మదనపల్లిలో గిరిరావు వీధిలో  మహేష్ అనే వాలంటీర్ పని చేస్తున్నాడు. అతను  కానీ ప్రజలతో రుబాబుగా వ్యవహరిస్తూంటాడు. వాలంటీరునని.. తనను ఎవరూ ఏమీ చేయలేరన్నట్లుగా.. కాలనీలోని యువకులను వెంటేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఇలా ఆదివారం రాత్రి కొంత మంది యువకులతో కలిసి మద్యం తాగాడు. అందరూ కలిసి మద్యం తాగి కాలనీలో గొడవ చేస్తూండటంతో.. మహేష్ తో పాటు మద్యం తాగి ఇతరులు అల్లరి చేస్తూండటంతో కాలనీలో ఉండే చంద్ర అనే వ్యక్తి వారిని వారించాడు.  అయితే వాలంటీర్ ను అయిన తననే ప్రశ్నిస్తావా అని మహేష్.. చంద్రపై బూతులు అందుకున్నాడు. 


ఈ లోపు చంద్ర భార్య గౌతవి ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాలంటీర్ మహేష్ ను నిలదీసింది. కాలని యువకులందర్నీ చెడగొడుతున్నావని.. అంతే కాకుండా  ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావని మండిపడింది. దీంతో మద్యం మత్తులో ఆగ్రహం వ్యక్తం చేసిన మహేష్.. మహిళ అని కూడా చూడకుండా గౌతమిపై దాడి చేశాడు. కాలనీ ప్రజలు చూస్తూండాగనే ఇష్టం వచ్చినట్లుగా  దాడి చేశారు. ఈ దాడిలో గౌతమికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులువాలంటీర్ ను అదుపులోకి తీసుకున్నారు. వాలంటీర్  ఇలా మద్యం మత్తులో అందర్నీ రోజూ ఇబ్బంది పెడుతూంటారని స్థానికులు ఫిర్యాదు చేశారు.               


వాలంటీర్లు చేస్తున్న నేరాలు ఇటీవలి కాలంలో వరుసగా హైలెట్ అవుతున్నాయి. ఒకటో తేదీన కొంత మంది వాలంటీర్లు పించన్ సొమ్ము తీసుకుని పారిపోయిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. మరికొంత మంది ప్లాస్టిక్ వేలి ముద్రలతో మోసం చేయడం.. నిరక్ష్యరాస్య లబ్దిదారుల నుంచి నగదు మాయం చేయండ వంటివి చేస్తున్నారు. వాలంటీర్లు చేసే తప్పులకు ఎవరు బాధ్యత వహిస్తారన్నదానిపై స్పష్టత లేకపోవడం.. వారికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తూండటంతో కొంత మంది చెలరేగిపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.