Amaravati Supreme Court :  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై దాఖలైన పటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని.. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో నిర్మించి, అభివృద్ధి చేయాలని ఆదేశిస్తూ.. ఏపీ హైకోర్టు గతేడాది మార్చిలో తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ప్రభుత్వ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు ఇచ్చిన తీర్పులో నిర్ణీత కాలంలోపు రాజధానిని నిర్మించాలన్న ఆదేశాలపై స్టే విధించింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే నిరాకరించింది. జనవరి 31న అన్ని అంశాలను విచారిస్తామని స్పష్టం చేసింది. ప్రతీవాదులందరికీ నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదించింది. 


ప్రతివాదులకు ఇటీవలే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసులు పంపింది. ప్రతివాదులైన రైతులు, వివిధ పార్టీల నేతలు, మంత్రులు పలువురు అధికారులు మొత్తం 261 మందికి  ఈ నోటీసులు జారీ అయ్యాయి. వీరిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. ఈ ప్రతివాదుల వాదలను సుప్రీంకోర్టు విననుంది. కేంద్ర ప్రభుత్వంకూడా అమరావతి విషయంలో తన అభిప్రాయాన్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేయనుండటం ఆసక్తి కలిగిస్తోంది. మరో వైపు  ఏపీ రాజధాని అంశం పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ను ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ పిటిషన్ వేశారు. వస్తాన్ వలీ దాఖలు చేసిన పిటీషన్ తో పాటు అమరావతి రాజధాని కేసును కూడా సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది.  
  
మరో వైపు ప్రభుత్వం , మంత్రులు మాత్రం సుప్రీంకోర్టులో విచారణ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏప్రిల్ నుంచి రాజధానిని విశాఖకు తరలిస్తున్నామన్న ప్రకటనలు చేస్తున్నారు. ఈ వ్యవహారం సబ్ జ్యూడిస్ అవుతుదని తెలిసినా మంత్రులు ప్రకటనలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ  ..  ప్రతీ వారం ఓ మంత్రి విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ ను తరలిస్తామని చెబుతున్నరు. ముందుగా ఎం క్యాంప్ ఆఫీస్ మాత్రమే కాకుండా.. వివిదశాఖల కార్యాలాయలను కూడా తరలిస్తామని చెబుతున్నారు. మరో వైపు రైతులు అమరావతి అంశంపై సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని రైతులు ధీమాగా ఉన్నారు. అందుకే మంగళవారం సుప్రీంకోర్టులో జరిగే విచారణ ఏపీరాజధాని విషయంలో కీలకం కానుంది. 


అయితే ప్రతి వాదులు వందల్లో ఉండటంతో వారి వాదనలు వినాలంటే.. ఎక్కువ సమయం పడుతుందని అందుకే.. మంగళవారం విచారణలో కీలకమైన నిర్ణయాలేమీ .. సుప్రీంకోర్టు తీసుకోకపోవచ్చని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం...విచారణ కొనసాగించినా పర్వాలేదని.. కానీ కార్యాలయాల తరలింపుపై మాత్రం స్టే ఎత్తివేస్తే చాలని కోరుకుంటోంది.   ీఈ అంశంపైనే  ప్రభుత్వ లాయర్  ప్రధానంగా వాదనలు వినిపించే అవకాశం ఉంది. యాధృచ్చికంగా అయినా ముఖ్యమంత్రి జగన్ ఈ వాదనలు జరుగుతున్న సమయంలో ఢిల్లీలోనే ఉండనున్నారు.