Today Top Headlines In AP And Telangana:
1. రాజమండ్రి నుంచి బోరుగడ్డ అనిల్ తరలింపు
గత ప్రభుత్వంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యులను జడ్జీలను కించపరుస్తూ మాట్లాడాడంటూ వైసిపి నేత బోరుగడ్డ అనిల్ పై అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. ఈ క్రమంలో శనివారం అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి అక్కడ ఉన్న బోరుగడ్డ అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్థాయి కోర్టు హనుమంతులతో మూడు రోజులపాటు నాలుగో పట్టణ పోలీసులు అనిల్ ను విచారించనున్నారు. ఇంకా చదవండి.
2. సినిమా వర్సెస్ పాలిటిక్స్, అదే అస్త్రంగా..
రాజకీయాలకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఆ హద్దులు అన్నిటిని చెరిపేస్తూ ముందు కెళుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ పార్టీలు. 'అల్లు వర్సెస్ మెగా ' అనే వివాదంలో ఎంత వాస్తవం ఉందో తెలియదు గాని ఆ వివాదాన్ని బేస్ చేసుకుని పొలిటికల్ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ముఖ్యంగా 'పుష్ప ' సినిమాని మెగా ఫాన్స్, జనసైనికులు తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కొందరు నేతలు అల్లు అర్జున్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్న వైనం చూసేవాళ్ళకి రోత పుట్టిస్తుంది. ఇంకా చదవండి.
3. టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు
వైసీపీ బలహీనం చేయాడానికి స్ట్రాటజిక్ గా ఆ పార్టీకి చెందిన కీలకనేతల్ని,క్లీన్ ఇమేజ్ ఉన్న వారిని చేర్చుకునేందుకు ఆ పార్టీ హైకమాండ్ ప్లాన్ చేసుకుంటోంది. అయితే పార్టీ క్యాడర్ మాత్రం సహకరించేందుకు సిద్ధంగా లేదు.ఎవర్నీ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని నిర్మోహమాటంగా చెబుతున్నారు. దీంతో చేరాలనుకున్న వారిని కూడా కొంత కాలం ఆగండి అని ఆపేస్తున్నారు. వైసీపీని నిర్వీర్యం చేయాలంటే నేతల్ని లాగేయాలని టీడీపీ హైకమాండ్ అనుకుంటోంది. వారు వస్తే తమ అవకాశాల్ని ఎక్కడ తన్నుకుపోతారోనని క్యాడర్ వ్యతిరేకిస్తోంది. ఇంకా చదవండి.
4. గజ్వేల్‌లో తీవ్ర విషాదం
మనల్ని 24 గంటలూ రక్షిస్తున్న పోలీసుల ప్రాణాలు తీశారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో హిట్ అండ్ రన్ ఘటన చూపరులకు కంటతడి పెట్టిస్తోంది. గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు జరిగింది. వాహనం ఢీకొన్న కొన్ని నిమిషాల్లోనే కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు జరిగింది. ఇంకా చదవండి.
5. మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం.. నిజమెంత?
లెజెండరీ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్, డాక్టర్ మంచు మోహన్ బాబు (Mohan Babu) మీద ఆయన రెండో కుమారుడు మనోజ్ (Manchu Manoj) ఫిర్యాదు చేశాడనే వార్త ఆదివారం ఉదయం తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు సైతం ఉలిక్కిపడేలా చేసింది. అయితే... అందులో నిజం లేదు! అసలు గొడవ జరగలేదా? అటువంటి తరుణంలో కొట్లాట అని బయటకు ఎందుకు వచ్చింది? ఈ రోజు ఉదయం మోహన్ బాబు ఎక్కడ ఉన్నారు? వంటి వివరాల్లోకి వెళితే.. ఇంకా చదవండి.