40 years Married Telangana Man Marries Class 8 Student: రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండలంలో ఘోరం జరిగింది. 13 సంవత్సరాల వయస్సు గల 8వ తరగతి విద్యార్థినిని.. చేవెళ్ల మండలం, కందివాడకు చెందిన 40 సంవత్సరాల శ్రీనివాస్ గౌడ్ పెళ్లి చేసుకున్నాడు. అప్పప్పటికే వివాహితుడు. స్థానిక ఆలయంలో ఈ బాల్య వివాహం జరిగింది.
బాధితురాలు చదువుతున్న పాఠశాలలోని ఒక ఉపాధ్యాయుడు ఈ బాల్య వివాహం గురించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని, నిందితులపై చర్యలు చేపట్టారు. పోలీసులు ఈ కేసులో నలుగురు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. శ్రీనివాస్ గౌడ్ (40) ఇప్పటికే వివాహితుడైన ఈ వ్యక్తి 13 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. శ్రీనివాస్ గౌడ్ భార్ ఈ వివాహానికి సమ్మతించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వివాహ వేడుకలో ఆచారాలు నిర్వహించిన వ్యక్తిని.. వివాహాన్ని ఏర్పాటు చేయడంలో సహాయపడిన వ్యక్తిపై కూడా పోలీసులు కేసు పెట్టారు. ఈ నలుగురిపై *Prohibition of Child Marriage Act, 2006* కింద కేసు నమోదు చేశారు.
బాధిత బాలిక శ్రీనివాస్ గౌడ్ ముందు దండతో నిలబడి ఉన్న దృశ్యాలు పోలీసులకు లభించాయి. ఈ దృశ్యాలలో శ్రీనివాస్ గౌడ్ భార్య , పూజారి కూడా కనిపించారు. బాధితురాలి తల్లి స్రవంతి ఇష్టపూర్వకంగానే తన కూతురును శ్రీనివాస్ గౌడ్‌కు ఇచ్చి వివాహం చేసినట్లు తెలుస్తోంది. ఆమె కూతురిని అత్తారింటికి వెళ్లమని ఒత్తిడి చేసినట్లు తెలిపాయి. ఈ ఘటన పట్ల బాలల హక్కుల కార్యకర్తలు మరియు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ బాల్య వివాహ ఘటన సామాజిక సమస్యలు ఇంకా ఇంకా ఉన్నాయన్న విషయాన్ని బయట పెట్టాయి. ఉపాధ్యాయుడు సమాచారం అందించడం వల్ల పోలీసులు వేగంగా స్పందించి, నిందితులపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన బాలల హక్కుల రక్షణ , బాల్య వివాహ నిర్మూలన కోసం మరింత అవగాహన అవసరమని ఈ ఘటన నిరూపిస్తోంది.
మారుతున్న సమాజంలో.. చాలా కటుంబాల్లో బాల్య వివాహాలపై అవగాహన వచ్చింది. అయితే నిరుపేద కుటుంబాల్లో మాత్రం ఇంకా బాలికల్ని భారంగా చూస్తున్నారు. ఎవరైనా కాస్త దనవంతుడు.. స్థితిమంతుడు వచ్చి పెళ్లి చేసుకుంటానంటే.. వయసుతో సంబంధం లేకుండా పెళ్లి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వాటిపై మరింత అవగాహన కల్పించాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.