ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 37,985 నమూనాలు పరీక్షించగా 326 కొత్త కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. నలుగురు మరణించారని తెలిపింది. కరోనా నుంచి కొత్తగా 466 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3898 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కోవిడ్ వల్ల గుంటూరులో ఇద్దరు, కృష్ణా, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని పేర్కొంది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,64,360కి చేరింది. వీరిలో 20,46,076 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 466 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 3898 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,386కు చేరింది.
కొవాగ్జిన్ టీకాను ఎట్టకేలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తించింది. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్) స్టేటస్ ఇవ్వాలని నిపుణుల కమిటీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు సూచించింది. కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్ డేటాను పరిశీలించిన అనంతరం డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వినియోగ అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.
ఇటీవల కొవాగ్జిన్‌కు అనుమతి వస్తుందని అంతా భావించినప్పటికీ తుది మదింపునకు గాను భారత్ బయోటెక్ నుంచి అదనపు సమాచారం అవసరమని డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం ఇటీవల తెలిపింది. తుది మదింపునకు ఈరోజు సాంకేతిక బృందం సమావేశమైంది. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ కోసం డబ్ల్యూహెచ్ఓకు సూచించింది.డబ్ల్యూహెచ్ఓ ఈ స్టేటస్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
Also Read: WHO on Covaxin: ఎట్టకేలకు 'కొవాగ్జిన్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం.. అత్యవసర వినియోగానికి ఓకే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి