Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో భారీగా ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేశారు. 30 మందిని ట్రాన్స్‌ఫర్ చేశారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ సెల్‌ విభాగంలో ఐజీగా ఉన్న కొల్లి రఘురామిరెడ్డిని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీగా బదిలీ చేశారు. ఆయనకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ డీజీ బాధ్యతలు కూడా అప్పగించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన వ్యక్తి ఈయనే. ఈయనకు డీజీ ర్యాంక్ ఇచ్చారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు డీజీగా ఉన్న కుమార్‌ విశ్వజిత్‌ను రైల్వేస్‌ అదనపు డీజీగా నియమించారు. 

నెల్లూరు జిల్లాలో ఎస్పీగా పని చేసిన సీహెచ్‌ విజయారావుకు కర్నూలు రేంజి డీఐజీగా నియమించారు. గతంలో గుంటూరు ఎస్పీగా పని చేసిన విశాల్‌ గున్నీని విశాఖ పట్నం రేంజి డీఐజీగా నియమించారు. ప్రస్తుతం విజయవాడ డీసీపీగా ఉన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న పల్లె జాషువాను చిత్తూలు జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. 

అనంతపురం ఎస్పీగా పని చేసిన ఫక్కీరప్పను విశాఖ పట్నం జాయింట్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. విజయవాడ లా అండ్‌ ఆర్డర్‌ విభాగం డీసీపీగా ఆనంద్‌రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉన్న రిషాంత్‌రెడ్డిని ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా నియమించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధక విభాగంలో ఉన్న ఎస్పీకి పూర్తి బాధ్యతలు అప్పగించారు. 

బదిలీ అయిన అధికారుల వివరాలు ఇవే

 అధికారి పేరు ఇప్పుడు ఉన్న స్థానం బదిలీ అయిన స్థానం 
1కుమార్‌ విశ్వజిత్‌అదనపు డీజీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రైల్వేస్‌ అదనపు డీజీ
2అతుల్‌ సింగ్‌ఏపీ పోలీస్‌ నియామక మండలి ఛైర్మన్‌ఏపీఎస్పీ అదనపు డీజీ
3సీహెచ్‌ శ్రీకాంత్‌సీఐడీ ఐజీఆక్టోపస్‌ ఐజీ
4కొల్లి రఘురామ్‌ రెడ్డినిఘా విభాగం ఐజీవిజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాధిపతి
5ఎస్‌వి రాజశేఖర్‌బాబుఆక్టోపస్‌ ఐజీఏపీ పోలీస్‌ నియామక మండలి ఛైర్మన్‌
6సర్వశ్రేష్ఠత్రిపాఠిడీజీపీ కార్యాలయ ఐజీ, అడ్నిన్‌ సీఐడీ ఐజీ
7ఎస్‌ హరికృష్ణవిశాఖ పట్నం డీఐజీపర్శనల్‌ విభాగం ఐజీ 
8కేవీ మోహన్ రావుడీజీపీ కార్యాలయ డీఐజీక్రీడల ఐజీ
9ఎస్‌ సెంథిల్‌కుమార్కర్నూలు రేంజ్‌ డీఐజీలా అండ్‌ ఆర్డర్‌ డీఐజీ, ఆక్టోపస్‌ డీఐజీ
10రాహుల్‌ దేవ్‌ శర్మఐదో బెటాలియన్‌ కమాండెంట్‌- విజయనగరంట్రైనింగ్‌ విభాగం డీఐజీ
11కే. ఫక్కీరప్పసీఐడీ ఎస్పీవిశాఖ పట్నం జాయింట్ కమిషనర్‌
12అమిత్‌ బర్దర్‌సీఐడీ ఎస్పీఆరో బెటాలియన్‌ కమాండెంట్‌, మంగళగిరి
13ఆరిఫ్‌ హఫీజ్‌గుంటూరు ఎస్పీఇంటిలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం ఎస్పీ 
14కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డిఆరో బెటాలియన్‌ కమాండెంట్‌, మంగళగిరిఆర్‌వీఈవో, రాజమండ్రి
15రిషాంత్ రెడ్డి చిత్తూరు ఎస్పీకౌంటర్‌ ఇంటిలిజెన్స్ సెల్‌ ఎస్పీ, ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నిరోధక విభాగం ఎస్పీ
16రవి ప్రకాష్‌ పశ్చిమగోదావరి ఎస్పీఏసీబీ ఎస్పీ 
17మణికంఠ చందోలుసెబ్‌ అదనపు ఎస్పీ, శ్రీకాకుళంవిశాఖపట్నం లా అండ్ ఆర్డర్‌ విభాగం-1 డీసీపీ
18అధిరాజ్‌ సింగ్ రాణానర్సీపట్నం ఏఎస్పీకమాండెంట్‌, ఐదో బెటాలియన్‌ విజయనగరం, 
19కృష్ణకాంత్‌ పటేల్‌సెబ్‌ అదనపు ఎస్పీ, కర్నూలుకామాండెంట్‌, మూడో బెటాలియన్‌ కాకినాడ, 
20కే శ్రీనివాస రావు విశాఖపట్నం లా అండ్ ఆర్డర్‌ విభాగం-1 డీసీపీజగ్గయ్యపేట డీసీపీ
21ధీరజ్‌ కునుబిల్లిపాడేరు ఏఎస్పీరంపచోడవరం ఏఎస్పీ
22జగదీష్ ఆనంద్ రెడ్డివిశాఖ పట్నం లా అండ్ ఆర్డర్‌ డీసీపీవిజయవాడ లా అండ్ ఆర్డర్‌ డీసీపీ
23మోకా సత్యనారాయణవిజయవాడ డీసీపీవిశాఖ పట్నం-2 లా అండ్ ఆర్డర్‌ డీసీపీ
24పీ జాషువాకృష్ణా జిల్లా ఎస్పీచిత్తూరు ఎస్పీ
25అజిత్ వేజెండ్లజగ్గయ్యపేట డీసీపీపశ్చిమగోదావరి ఎస్పీ
26తుషార్‌ దూదికడప జిల్లా అదనపు ఎస్పీగుంటూరు ఎస్పీ
27నయీమ్‌ అస్మిఏసీబీ ఎస్పీకృష్ణా జిల్లా ఎస్పీ 
28విజయారావు కామాండెంట్‌, మూడో బెటాలియన్‌ కాకినాడ, కర్నూలు రేంజ్‌ డీఐజీ
29విశాల్‌ గున్నీవిజయవాడ లా అండ్ ఆర్డర్‌ డీసీపీవిశాఖపట్నం రేంజ్ డీఐజీ