PM Kisan Samman Nidhi: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత మొత్తాన్ని 2022 డిసెంబర్ చివరి వారంలో లేదా 2023 కొత్త సంవత్సరం జనవరి మొదటి వారంలో రైతుల ఖాతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేయనున్నారు. ఈ-కేవైసీ చేయించుకోని రైతులు తమ కేవైసీని వెంటనే చేయించుకోవాలి, లేనిపక్షంలో 13వ విడత మొత్తం బ్యాంకు ఖాతాల్లో పడబోదు. 


కొత్త రిజిస్ట్రేషన్‌కు రేషన్ కార్డు తప్పనిసరి!


పీఎం కిసాన్ యోజన కింద ఇంకా నమోదు చేసుకోని రైతులు నమోదు చేసుకోవడానికి రేషన్ కార్డు అవసరం. రేషన్ కార్డులు లేని రైతులు వెంటనే రేషన్ కార్డులు చేయించుకోవాలి. పీఎం కిసాన్ యోజనలో రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం రేషన్ కార్డును తప్పనిసరి చేసింది. ఈ పథకాన్ని అర్హత లేని వ్యక్తులు కూడా దీని నుంచి లబ్ధి పొందుతున్నారు. దీని వల్ల చాలా మంది అనర్హుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఈ మోసాన్ని నివారించడానికి, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రేషన్ కార్డు కాపీని పోర్టల్‌లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. పోర్టల్లో రేషన్ కార్డు నంబర్ నమోదు చేసిన తర్వాత మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రూ.2,000 ఇన్‌స్టాల్‌మెంట్‌ ఖాతాల్లో పడుతుంది. పిఎం కిసాన్ యోజన పొందాలనుకునే లబ్ధిదారులు రిజిస్టర్ చేసేటప్పుడు తప్పనిసరి రేషన్ కార్డుతోపాటు ఇతర డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీని పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.


పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు ఈ-కేవైసీని తప్పనిసరి


పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు కచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలి. అలా చేయించుకున్న వారికే తర్వాత 12 విడత డబ్బులు తమ ఖాతాల్లో పడ్డాయి. ఒక వేళ మీరు ఇంకా కేవైసీ చేయనట్లయితే, 13వ ఇన్‌స్టాల్మెంట్ డబ్బు మీ అకౌంట్‌లోనికి రాదు. ఇ-కేవైసీ లేకుండా 13వ ఇన్ స్టాల్ మెంట్‌లో మీ పేరు మీద వచ్చిన సొమ్మును ఫ్రీజ్ చేస్తారు. ఈకైవైసీ ప్రక్రియను ఆన్ లైన్‌లో పూర్తి చేయవచ్చు.


పీఎం కిసాన్ యోజన అంటే ఏమిటి?


పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని రెండు వేల రూపాయల చొప్పున మూడు సమాన వాయిదాల్లో రైతుల ఖాతాకు బదిలీ చేస్తారు. వాయిదాలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వస్తాయి. అంటే సంవత్సరానికి మూడుసార్లు, 2000 రూపాయల చొప్పున ఈ పథకం కింద రైతుల ఖాతాకు పంపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బును నేరుగా రైతుల ఖాతాకు బదిలీ చేస్తుంది. ఇప్పటి వరకు రూ.2,000 చొప్పున 12 వాయిదాలను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. 2022 అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ 12వ విడత మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు.