Electricity Voltage Detector Price: తెలుగు రాష్ట్రాల్లో పొలం పనులు మొదలయ్యాయి. చాలా జిల్లాల్లో వర్షాలు జారు అందుకున్నాయి. అయితే ఇలా పొలం పనులకు వెళ్లిన రైతులు విద్యుత్ ఘాతంతో మృతి చెందే ఘటనలు చూస్తూనే ఉంటారు. అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఈ ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ చాలా ఉపయోగపడుతుంది. పొలానికి వెళ్లే ప్రతి రైతు వద్ద కచ్చితంగా ఉండాల్సిన పరికరమని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. 

ఎందుకు అవసరం పొలంలో మోటార్ ఆన్ చేయడనికో, లేదా పొలంలో ఉన్న పంట చూడటానికో రైతులు వెళ్తుంటాడు. పడుతున్న వర్షాల కారణంగా విద్యుత్ మోటార్లు ప్రాంతంలో ప్రమాదాలు జరగొచ్చు. కరెంటు షాక్‌తో ప్రాణాలు పోవచ్చు. మరోవైపు చాలా మంది పంటలను కాపాడుకునేందుకు విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేస్తున్నారు. అటవీ జంతువుల నుంచి పంట కాపాడుకునేందుకు ఇలాంటి విద్యుత్ తీగలతోకూడిన కంచెలను ఏర్పాటు చేస్తారు. వాటిని తెలియకుండానే తగిలిన రైతులు మృతి చెందుతున్నారు. 

వర్షాలకు గాలి వానలకు విద్యుత్ స్తంభాలు ఒడిపోవడం లేదా వాటిపై చెట్లు పడి ఆ విద్యుత సరఫరా పొలంలో ఉన్న పైరుకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా రైతుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది.  ఇలాంటి ప్రమాదాల్లో కూడా రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. 

ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ ఎలా పని చేస్తుంది?పొలాల్లో జరిగే ఇలాంటి ప్రమాదాల నుంచి తమను కాపాడుకోవడానికి రైతులు ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ ఉంచుకోవాలని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. దీని వల్ల విద్యుత్ ప్రమాదాలు చాలా వరకు తగ్గించవచ్చని అంటున్నారు. ఇందులో ఇందులో రెండు రకాల బటన్స్ ఉంటాయి. హెచ్‌లో పెట్టుకుంటే దాదాపు ఏడు మీటర్ల దూరంలో ఉన్న విద్యుత్ సరఫరాను గుర్తించివచ్చు. ఎల్‌ అటే సమీపంలోకి వెళ్తే కానీ విద్యుత్ సరఫరా గురించి తెలియదు. విద్యుత్ సరఫరా తెలియజేసేందుకు అలారం కూడా మోగుతుంది. 

ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ ఎక్కడ లభిస్తుంది?ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ ఏ ఎలక్ట్రికల్ షాపులోనైనా లభిస్తుంది. లేదంటే ఆన్‌లైన్‌ స్టోర్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్టు లాంటి వాటిలో కూడా దొరుకుతుంది. 

ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ ధర ఎంత ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ ఒక్కో కంపెనీ ఒక్కో ధర ఉంది. ఇది 250 రూపాయల నుంచి 600 రూపాయల వరకు ఉంటుంది. అందులో ఫెసిలిటీస్‌ను బట్టి ధర ఉంటుంది. ఏ ధర ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ తీసుకున్నా పని చేసే తీరు మాత్రం ఒకటే ఉంటుంది. 

ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ ఎవరెవరికి ఉపయోగపడుతుంది? ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ కేవలంరైతులకే కాదు విద్యుత్ పని చేసే వారికి కూడా పని చేస్తుంది. ఇంట్లో కూడా మీరు ఉంచుకోవడం మంచిది. ఇంట్లో చేసే చిన్న చిన్న విద్యుత్ పరికరాల రిపేర్లకు వైరింగ్‌కు సంబంధించిన రిపేర్లు చేసేటప్పుడు ఇది ఎంతగానో యూజ్ అవుతుంది.