తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక అసాధారణ రీతిలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. అధిక వర్షాలతో ఓవైపు పంట నష్టం జరిగిన, మరోవైపు ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆయా పంటల వారీగా అధికంగానే సాగైందని చెప్పవచ్చు.


ప్రస్తుతం ఈ సంవత్సరం సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతోంది. ఇదే సమయానికి గత ఏడాది 83.43 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందని లెక్కల్లో చెప్పింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో వానకాలం సీజన్‌లో సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలకు ఎగబాకింది. ఇప్పటి వరకు 95.78 లక్షల ఎకరాలకు 77 శాతం సాగు చేరిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ బుధవారం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 36.06 లక్షల ఎకరాల్లో... అంటే 72 శాతం నాట్లు వేశారని తెలిపింది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు ఉండగా... 44.49 లక్షలు ఎకరాల్లో 87 శాతం సాగవుతుందని తెలియజేసింది. 


నాలుగు జిల్లాల్లో 100 శాతానికి పైగా సాగు.... నాలుగు జిల్లాల్లో సాగు విస్తీర్ణం 100 శాతానికిపైగా పెరిగింది. ఆయా జిల్లాల వారీగా చూస్తే మెదక్ 105.80, అదిలాబాద్ 103.90, కొమరం భీం ఆసిఫాబాద్ 102.19, నిజామాబాద్ 101.10 శాతం విస్తీర్ణంలో వివిధ పంటలు సాగయ్యాయి. అత్యంత తక్కువగా వనపర్తిలో 24.90 శాతం, ఆ తర్వాత మూలుగు 32.90 శాతం పంటలు సాగయ్యాయని అని అధికారులు నివేదిస్తున్నారు.


ఇక రాష్ట్రంలో ఈ సీజన్లో ఇప్పటివరకు 31 శాతం అధిక వర్షపాతం నమోదయింది. జూన్ నెలలో 44 శాతం వర్షపాతం కొరత ఉండగా... జూలై నెలలో ఏకంగా 114 శాతం భారీ అధిక వర్షపాతం నమోదయింది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో అధిక వర్షపాతం, ఆరు జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదయింది. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయి.


జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగులు, పప్పు దినుసులు, వేరుశనగ, సోయాబీన్ సాగును రైతులు ఇప్పటికే ప్రారంభించారని వివరించింది. వరి నాట్లు వచ్చే నెల మొదటి వారం వరకు సాగనున్నయని అప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పంటల సాగు కోటి ఎకరాలను దాటుతుందని పేర్కొంది. 


జిల్లాల వారిగా సాగు చూసుకుంటే..... అదిలాబాద్, కొమరం భీం, నిజామాబాద్, మెదక్ జిల్లాలో 100 శాతానికి పైగా పంటలు సాగుతున్నట్లు వ్యవసాయ శాఖ నిర్ధారించింది. వనపర్తి లో 25 శాతం విస్తీర్ణంలోపే పంటలు సాగుతున్నాయని ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ములుగు, మేడ్చల్ జిల్లాల్లో 40 శాతం, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, సూర్యాపేట జిల్లాలో 70 శాతం పంటలు సాగుతున్నాయి. 


మిగిలిన జిల్లాలు అంటే నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, భద్రాద్రి, సంగారెడ్డి, జనగామ, వికారాబాద్, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి, జిల్లాలో 90 శాతం పంటలు సాగుతున్నాయి.


పంటల వారీగా సాగు ప్రారంభం చూస్తే... మొక్కజొన్న 5.02 లక్షల సాగు విస్తీర్ణం(70శాతం), సోయాబీన్ 4.43 లక్షల ఎకరాలు (107 శాతం), జొన్న 21 వేల ఎకరాలు(26.74శాతం), చెరుకు 20 వేల ఎకరాలు(31.49శాతం), మినుములు 18 వేల ఎకరాలు(41 శాతం), పెసర్లు 49 వేల ఎకరాలు(39 శాతం), నువ్వులు 2 వేల ఎకరాలు (8 శాతం సాగు విస్తీర్ణం) లో ఉన్నాయి.