ఏపీలో విస్తృతంగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ ప్రాంతంతోపాటు, ఆర్ఓఎఫ్ఆర్ భూములు, ప్రైవేటు భూములు, కాలువలు, చెరువులు, రిజర్వాయర్లుకు సంబంధించిన గట్లపైన పెద్దఎత్తున వెదురు పెంపకాన్ని చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్‌ సమీర్‌ శర్మ ఆదేశించారు. రైతులను అన్ని విధాలా ప్రోత్సహించాలని సూచించారు. అమరావతి సచివాలయం మొదటి బ్లాకు రాష్ట్ర బ్యాంబూ మిషన్ సమావేశం సిఎస్ అధ్యక్షతన జరిగింది.


రాష్టంలో వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర స్థాయిలో సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర బ్యాంబూ మిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మిషన్‌లో వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు, వ్యవసాయ, సహకార శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, స్పెషల్ సిఎస్ ఇండస్ట్రీస్, పిఆర్ అండ్ ఆర్డీ ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, రైతు సంక్షేమ సంఘాల నుంచి నియమించిన ప్రతినిధి, ఉత్పత్తి, ప్రోససింగ్ రంగాల నుంచి  ఇద్దరు నిపుణులు సభ్యులుగా, ఉద్యానవన శాఖ కమిషనర్ సభ్య కార్యదర్శిగా ఈ మిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 


సిఎస్ సమీర్ శర్మ మాట్లాడుతూ.. రాష్ట్ర బ్యాంబూ మిషన్ వద్ద కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం నిధులు రూ. 710 కోట్లు రాష్ట్ర వాటా 40శాతం నిధులు 473 కోట్లు కలిపి 1184 కోట్ల రూపాయ‌ల‌ నిధులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వెదురును ముఖ్యంగా నిర్మాణ రంగంలోను, పేపరు తయారీ, అగరబత్తీల తయారీ, ఫర్నీచర్, హ్యాండీ క్రాప్ట్స్,ఫైబర్ తయారీలో వెదురును విరివిగా వినియోగిస్తున్నందున మంచి డిమాండు ఉందని చెప్పారు. ఇతర అవసరాలకు నేడు వెదురుకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వెదురును దిగుమతి చేసుకుంటున్నారని చెప్పారు.


బ్యాంబూ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం 60శాతం,రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేందుకు సబ్సిడీ రూపంలో తోడ్పాటును అందిస్తున్నట్టు సీఎస్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థల పరిధిలో వెదురు పెంపకం చేపడితే యూనిట్ కాస్ట్‌లో నూరు శాతం సబ్సిడీని కల్పిస్తామన్నారు. ప్రైవేట్‌గా చేపడితే 50శాతం సబ్సిడీ అందిస్తారని చెప్పారు. రాష్ట్రంలోని అందరు రైతులు బ్యాంబూ మిషన్ కింద సబ్సిడీని పొందేందుకు అర్హులేనని సిఎస్ స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాలతోపాటు ఆర్ఓఎఫ్ఆర్ భూములు, ప్రైవేటు భూములు, వివిధ గట్లపైన వెదురు పెంపకాన్ని విరివిగా చేపట్టేలా రైతులను అన్ని విధాలా ప్రోత్సహించాలని సిఎస్ రాష్ట్ర బ్యాంబూ మిషన్ డైరెక్టర్ అయిన ఉద్యానవన శాఖ కమీషనర్ ఆదేశించారు.


రాష్ట్రంలో వెదురు పెంపకానికి అటవీ ప్రాంతాలతోపాటు కోస్తా ప్రాంతం ఇతర ప్రాంతాలు కూడా అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయని కావున రైతులను ప్రోత్సహించి వెదురు పెంపకం చేపట్టేలా ప్రత్యేక దృష్టి సారించాలని సమీర్ శర్మ చెప్పారు. వివిధ స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా వెదురు పెంపకానికి తగిన చర్యలు తీసుకోవాలని సెర్ప్ సిఇఓ ఇంతియాజ్ ను సిఎస్ ఆదేశించారు. రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్, రాష్ట్ర బ్యాంబూ మిషన్ సభ్య కార్యదర్శి శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బ్యాంబూ మిషన్ ఏర్పాటు ఆవశ్యకత దాని విధి విధానాలు, నిధుల లభ్యత, ఇప్పటి వరకూ చేపట్టిన చర్యలు వివరించారు.