Andhra Pradesh Latest News: మిర్చి ధరల పతనంపై చంద్రబాబు క్లారిటీ- కేంద్రం దృష్టికి రైతుల కష్టాలు 

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి ధరలు పడిపోవడంపై కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Continues below advertisement

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌ మిర్చి రైతుల కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి రిక్వస్ట్ చేస్తూనే మిర్చి రైతుల ఇబ్బందులు కూడా వివరించినట్టు వెల్లడించారు. 

Continues below advertisement

దిల్లీలో కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పడిపోయిన మిర్చి ధర విషయంపై చర్చించారు. ఎప్పుడూ లేనంతగా ఈసారి మిర్చి ధరలు పతనమైపోయాయని చెప్పుకొచ్చారు. విదేశాల్లో డిమాండ్ తగ్గడం వల్ల దాని ఎఫెక్ట్‌ రాష్ట్రంలో రైతులపై పడిందని వాపోయారు. దీని వల్ల చాలా నష్టం జరుగుతోందని వివరించారు.  
మిర్చి ఎగుమతులపై దృష్టి పెట్టాల్సి ఉందని అసలు డిమాండ్ ఎందుకు తగ్గిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు చంద్రబాబు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని అందుకు తగ్గట్టు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. దీనిపై కేంద్రమంత్రితో చర్చించామని వివరించారు. మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద 25 శాతం ఐసీఏఆర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఇస్తారని పేర్కన్నారు. అందులో ఏపీలో కాస్ట్‌ ఆఫ్‌ కల్టివేషన్‌ తీసుకోలేదని గుర్తు చేశారు. దీని ప్రకారమే ధర నిర్ణయిస్తున్నారని తెలిపారు. ఇది కూడా రైతులు తీవ్ర నష్టం కలుగుతుందని వెల్లడించారు. 

ఇలా చాలా డీప్‌గా మిర్చి రైతుల సమస్యలపై చర్చించామన్నారు చంద్రబాబు. కచ్చితంగా భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాస్ట్‌ ఆఫ్ కల్టివేషన్ ఆధారంగా ధర నిర్ణయించాలని సూచించామన్నారు. అన్నీ సరి చేసి రైతుకు న్యాయం చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్టు చంద్రబాబు వెల్లడించారు. శుక్రవారం శాఖాపరమైన సమావేశం తర్వాత వీటిపై క్లారిటీ ఇస్తామని తెలిపినట్టు చంద్రబాబు వివరించారు. ధరల స్థిరీకరణపై కూడా ఆలోచన చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.  

ఈ ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే ముందు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశమై పోలవరం ప్రాజెక్టు అంశంపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కూడా పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు బనకచర్ల విషయాన్ని కూడా కేంద్రమంత్రికి ఇద్దరు నేతలు వివరించారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకు తగ్గట్టుగానే నిధుల విడుదలలో చొరవ చూపించాలని వేడుకున్నారు. 

 కృష్ణా జలాల వాడకంపై క్లారిటీ 
తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా ఉన్న కృష్ణా జలాలపై కూడా చంద్రబాబు మాట్లాడారు. అసలు చేసుకున్న ఒప్పందానికి మించిన ఒక్క చుక్క నీరు కూడా వాడుకోవడం లేదని స్పష్టం చేశారు. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని సముద్రంలో కలిసే నీటినే వాడుకుంటున్నాం అని అన్నారు. ఆ వెసులుబాటు ఏపీకి ఉందని దాన్నే వాడుకుంటున్నామని వివరించారు. కొందరు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. 

జగన్‌ భద్రతపై కూడా చంద్రబాబు స్పందన 
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పర్యటించడం వైఎస్ జగన్ చేసిన తప్పని అన్నారు. రావద్దని పోలీసులు చెప్పినా వినిపించుకోలేదని తెలిపారు. ప్రజా సమస్యలపై స్పందించేందుకు చాలా వేదికలు ఉన్నాయని ఇలా రూల్స్‌ బ్రేక్‌ చేసి వెళ్లి ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని విమర్శించారు.  

Continues below advertisement
Sponsored Links by Taboola