ఏమిటీ అపెండిసైటిస్? అపెండిక్స్ అనేది చిన్న సంచిలా ఉండే అవయవం. పెద్దపేగులకు అనుబంధంగా చివరలో వేలాడినట్టు ఉంటుంది. అపెండిసైటిస్ వచ్చినప్పుడు అపెండిక్స్ వాచిపోయి తీవ్రమైన నొప్పి పెడుతుంది.

ఎవరికి అపెండిసైటిస్ వచ్చే అవకాశం ఉంది? అపెండిసైటిస్ ఏ వయసులో ఉన్న వారికైనా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా అయితే పదేళ్ల నుంచి ఇరవైఏళ్ల మధ్యలో ఉన్నవారిలో అధికంగా కనిపిస్తుంది.

లక్షణాలేంటి? నొప్పి హఠాత్తుగా, చాలా తీవ్రంగా వచ్చేస్తుంది. కాస్త నీరసంగా అనిపించడం, ఆకలి లేకపోవడం, విరేచనాలు కావడం, జ్వరం వస్తుంది.

అపెండిసైటిస్ రావడానికి కారణాలేంటి? ఈ పరిస్థితి ఎందుకొస్తుందో ఇంతవరకు సరైన కారణం తేలలేదు. అపెండిక్స్ ప్రవేశద్వారం మూసుకుపోయినప్పుడు ఇలా జరుగుతుందని భావిస్తారు.

చికిత్స ఎలా ఉంటుంది? అపెండిసైటిస్ రెండు రకాలు. ఒకటి దీర్ఘకాలిక లక్షణాలతో సాగితే, మరొకటి తీవ్రంగా వస్తుంది. అపెండిసైటిస్ తీవ్రంగా మారితే అపెండిక్స్ పగిలిపోయే ప్రమాదం ఉంది. వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది.