విరాట్ కోహ్లీ(భారత్): టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్‌, ఆరు మ్యాచ్‌ల్లో 296 పరుగులు చేశాడు. 98.66 సగటుతో మూడు అర్ధ సెంచరీలు కొట్టాడు.



మాక్స్ ఓ'డౌడ్(నెదర్లాండ్స్‌): ఎనిమిది మ్యాచ్‌ల్లో 242 పరుగులు చేశాడు. రెండు అర్ధశతకాలు ఉన్నాయి. సగటు 34 కంటే ఎక్కువగా



సూర్యకుమార్ యాదవ్(భారత్‌): ఆరు మ్యాచ్‌లలో 239 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ ఏకంగా 189.6గా ఉంది. మూడు అర్ధ సెంచరీలు కొట్టాడు.



జోస్ బట్లర్(ఇంగ్లండ్ ): సెమీఫైనల్‌లో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. రెండు అర్థ సెంచరీలతో 225 పరుగులు చేశాడు.



కుశాల్ మెండిస్(శ్రీలంక ): మెండిస్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 223 పరుగులు చేశాడు.



వనిందు హసరంగ(శ్రీలంక ): ఈ శ్రీలంక లెగ్ స్పిన్నర్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు.



శామ్ కరన్(ఇంగ్లండ్ ): ఈ ఆల్ రౌండర్ 13 వికెట్లతో టోర్నమెంట్‌ను ముగించాడు. ఫైనల్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.



బాస్ డి లీడే(నెదర్లాండ్స్ ): నెదర్లాండ్స్ గ్రూప్ దశకు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఎనిమిది మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.



బ్లెస్సింగ్ ముజారబానీ(జింబాబ్వే ): ఈ పేసర్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు.



అన్రిచ్ నోర్ట్జే(దక్షిణాఫ్రికా) : కేవలం ఐదు గేమ్స్‌లోనే అతను 11 వికెట్లు తీశాడు.