వేసవిలో వడగాల్పులు చాలా ప్రమాదకరమైనవి. పిల్లలు, వృద్ధులు, రోగాలతో బాధపడేవారికే ఎక్కువ ముప్పు.

వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా వడగాల్పుల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు.

వేసవిలో వీచే వేడిగాలులే హీట్ స్ట్రోక్‌కు కారణమవుతాయి.

బయటకు వెళ్లినప్పుడు క్యాప్, చెవులకు రుమాలు కట్టుకోవాలి. కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి.

వడదెబ్బ లక్షణాలు: తలనొప్పి లేదా తల తిరగడం వడ దెబ్బ మొదటి లక్షణం.

వేడిగా ఉన్నప్పటికీ చెమట పట్టకపోవడం. శరీరం పొడిగా మారడం.

చర్మం ఎర్రగా మారడం, తిమ్మిరులు.

వికారం లేదా వాంతులు రావడం.

గుండె వేగంగా కొట్టుకోవడం. శ్వాస వేగంగా పీల్చుకోవడం.

గందరగోళం, పిచ్చిగా మాట్లాడటం.

మూర్ఛ, అపస్మారక స్థితికి చేరుకోవడం.

ఆ లక్షణాల్లో ఏది కనిపించినా వడదెబ్బగా పరిగణించాలి.

వడదెబ్బ తగిలిన వెంటనే నీడలోకి వెళ్లి శరీరాన్ని చల్లబరుచుకోవాలి, నీళ్లు తాగాలి.

All Images and Video Credits: Pixabay, Pixels and Unsplash