2024 టీ20 వరల్డ్ కప్ జూన్ 2వ తేదీ నుంచి వెస్టిండీస్, యూఎస్‌ఏల్లో జరగనుంది. ఇండియా గ్రూప్-ఏలో ఉంది. పాకిస్తాన్ కూడా ఇదే గ్రూప్‌లో తలపడనుంది. వీటితో పాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ జట్లు కూడా గ్రూప్-ఏలోనే ఉన్నాయి. టీమిండియా తన మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. జూన్ 5వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. జూన్ 9వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పోటీ పడనుంది. జూన్ 12వ తేదీన యూఎస్ఏ జట్టుతో భారత్ ఆడనుంది. జూన్ 15వ తేదీన తన నాలుగో మ్యాచ్‌లో కెనడాతో తలపడనుంది. ఈ టోర్నమెంట్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ కాగా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్. 2007 టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో గెలుచుకుంది.