కృష్ణుడిని గోవింద అని ఎందుకు పిలుస్తారు?

Published by: RAMA

కృష్ణుడి ఎన్నో పేర్లలో ప్రసిద్ధి చెందింది గోవింద నామం

గోవింద అంటే ఇంద్రియాలకు ఆనందం కలిగించేవాడు అని అర్థం

కృష్ణుడి కంఠస్వరం, వేణుగానంలో మాధుర్యం అందర్నీ మంత్రముగ్ధులను చేస్తాయి

అందుకే..గోపికలు, గోపాలురు ఆయనను గోవింద అంటారు

ద్రౌపది నిండు సభలో అవమానం ఎదుర్కొన్నప్పుడు కూడా గోవిందా అనే పిలిచింది

గోవింద పుండరీకాక్ష రక్ష శరన్నగతం అని ప్రార్థించింది ద్రౌపది

గోవింద అంటే భూమికి రక్షకుడు అని మరో అర్థం

మహాభారతంలో శాంతిపర్వం ప్రకారం..పాతాళానికి కుంగిన భూమిని శ్రీకృష్ణుడు పునఃస్థాపన చేశాడు

అందుకే..దేవతలు గోవిందా (భూమి రక్షకుడు) అని స్తుతించారు