2026 శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు?

Published by: RAMA

అధర్మాన్ని జయించి ధర్మాన్ని స్థాపించేందుకు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడు శ్రీమహావిష్ణువు

భాద్రపద మాసం, రోహిణి నక్షత్రం, కృష్ణపక్షం ఎనిమిదవ రోజు మధురలో జన్మించాడు కృష్ణుడు

2026లో శ్రీ కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 4 శుక్రవారం వచ్చింది

భాద్రపద కృష్ణ అష్టమి సెప్టెంబర్ 3 గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత మొదలైంది

సెప్టెంబర్ 04 శుక్రవారం రాత్రి 11 గంటల 28 నిముషాల వరకు ఉంది

సెప్టెంబర్ 04 న సూర్యోదయానికి తిథి ఉండడంతో ఈ రోజే కృష్ణాష్టమి

సెప్టెంబర్ 04న రోహిణి నక్షత్రం కూడా ఉండడం విశేషం

శ్రీకృష్ణాష్టమి ఏటా ఆగష్టు నెలో వచ్చేది...

ఈ ఏడాది జ్యేష్ఠమాసం అధికం రావడంతో పండుగలు గతేడాది కన్నా ఆలస్యమవుతున్నాయ్