ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. ఉదయం 6.30 గంటలకు కర్నూల్ జిల్లాలో రాహుల్ పాదయాత్ర ప్రారంభం అయింది ఆలూరు, ఆదోని ఎమ్మిగనూరు, మంత్రాలయంలో 4 రోజులపాటు 119 కిలోమీటర్ల మేర యాత్ర ఆరున్నర గంటలకు పాదయాత్ర ప్రారంభం, క్షేత్ర గుడి నుండి 10:30 గంటలకు విరామం రాత్రికి చాగి గ్రామంలో నైట్ హాల్ట్ ఉంటుంది. 19న ఉదయం 6.30 నిమిషాలకు తిరిగి చాగి నుంచి రాహుల్ యాత్ర ప్రారంభం రాత్రి 7 గంటలకు ఆదోనిలోని ఆరేకల్ లోని జెల్లి నాగన్నా తాతా దర్గా వరకు యాత్ర 20వ తేదీ ఉదయం 6.30 నిమిషాలకు పాదయాత్ర ఎమ్మిగనూరు నుంచి ప్రారంభం 21న మంత్రాలయం టెంపుల్ సర్కిల్ నుంచి యాత్ర, ఉదయం 10.30 నిమిషాలకు కర్ణాటకలోకి రాయచూర్ పూర్తయ్యాక రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుంది